ETV Bharat / international

'ఎయిడ్స్ బాధితులకు కరోనా కష్టాలు' - corona in hiv people

కరోనా విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులకు అందే చికిత్సపై ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూహెచ్​ఓ. హెచ్​ఐవీ ఔషధాలను కరోనాకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో అసలైన బాధితులకు మందుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

who
ఎయిడ్స్ బాధితులకు కరోనా కష్టాలు: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Jul 7, 2020, 10:37 AM IST

కరోనా విజృంభణ వేళ అంతర్జాతీయంగా ఎయిడ్స్ చికిత్సలపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్(డైరెక్టర్) జనరల్ టెడ్రోస్ అధనోం. హెచ్​ఐవీ ఔషధాలను కరోనాకు ఉపయోగిస్తున్న కారణంగా మందులకు కొరత ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

"హెచ్​ఐవీ ఔషధాలు విస్తృతంగా కరోనాకు వాడుతున్నట్లు మేం చేసిన సర్వేలో వెల్లడైంది. 73 దేశాల్లో ఎయిడ్స్​కు ఉపయోగించే యాంటీ రెట్రోవైరల్ మెడిసిన్ నిల్వలు తరిగిపోతున్నట్లు సమాచారం అందింది. మహమ్మారి వల్ల ఏర్పడే మందుల కొరతను తట్టుకునేందుకు అన్ని దేశాలు ఎయిడ్స్ బాధితులకు ఆరు నెలలకు సరిపోయేలా ఔషధాలను సూచించాలి."

- టెడ్రోస్ అధనోం, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్

2018-19 సంవత్సరాల్లో హెచ్​ఐవీ కేసులు ఏటా 1.7 మిలియన్లు మాత్రమే పెరిగాయని వెల్లడించారు అధనోం. హెచ్​ఐవీ పరీక్షలు, నియంత్రణ సేవలు సరైన రీతిలో అందని కారణంగా బాధితులకు అవసరమైన మేరకు చికిత్స అందడం లేదని స్పష్టం చేశారు. 3 కోట్ల 80 లక్షలమంది హెచ్​ఐవీతో బాధపడుతున్నారని.. వారిని ఎంతమాత్రం విస్మరించకూడదని చెప్పారు.

'బాధిత పిల్లల్లో సగం మందికే చికిత్స'

హెచ్​ఐవీతో బాధపడుతున్న బాల, బాలికల్లో సగం మందికే చికిత్స అందుతున్నట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్​ఓ. హెచ్​ఐవీ కేసులు ఇటీవల కాలంలో తగ్గాయని, మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదవుతుందన్న డబ్ల్యూహెచ్​ఓ.. పిల్లలకు చికిత్స అందించడంలో విఫలమవుతున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: 'చైనా వెనక్కి తగ్గినా.. భారత్​ అప్రమత్తంగానే ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.