ETV Bharat / international

ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ మస్ట్- త్వరలోనే ఉత్తర్వులు!

కరోనా డెల్టా వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులందరికీ.. టీకా తప్పనిసరి చేయాలని అమెరికా సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

vaccine mandate in usa
ఉద్యోగులకు టీకా తప్పనిసరి
author img

By

Published : Jul 28, 2021, 12:55 PM IST

డెల్టా వైరస్ విజృంభణ తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్​ను తప్పనిసరిగా చూపించేలా నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. టీకా తీసుకున్నట్లు ఆధారాలు చూపించకపోతే.. కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదా మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయనుంది.

బైడెన్ సర్కారు ఈ మేరకు విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీకా తప్పనిసరి నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం. తమ నివాస ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తితో సంబంధం లేకుండా ఈ రూల్​ను అమలు చేయనున్నారు. దీనిపై తుది ప్రకటన ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

సైన్యంలో పనిచేస్తున్నవారితో కలిపి అమెరికాలో 42 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరి కోసం కొత్త నిబంధనలు రూపొందిస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారమే సూత్రప్రాయంగా వెల్లడించారు. అయితే, దీనిపై ప్రభుత్వం కసరత్తులు దాదాపుగా పూర్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వెటరన్ అఫైర్స్ శాఖ.. తమ అధీనంలోని హెల్త్ వర్కర్లకు టీకా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మళ్లీ మాస్కులు

మరోవైపు, సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సైతం తన మార్గదర్శకాలను సవరించింది. టీకా తీసుకున్నవారికి మాస్కులు అవసరం లేదని గతంలో సూచించిన సీడీసీ.. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న చోట ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని తాజాగా స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో శ్వేతసౌధంలోనూ మళ్లీ మాస్కులు దర్శనమిచ్చాయి.

ఇదీ చదవండి: డెల్టా పంజా- ప్రపంచదేశాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.