ETV Bharat / international

కరోనా పాలిటిక్స్​: ట్రంప్​ వర్సెస్​ ఒబామా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతోందని బరాక్ ఒబామా మరోసారి విమర్శించారు. అయితే ఈ విమర్శలను ట్రంప్ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఒబామా అధికారంలో ఉన్నప్పుడు... కరోనా లాంటి విపత్తులు ఎదుర్కోవడానికి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రతిదాడి చేసింది.

White House blames Obama administration for inadequate pandemic plan
ట్రంప్, ఒబామాల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
author img

By

Published : May 17, 2020, 11:01 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తున్నా... ట్రంప్ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శల దాడి చేస్తున్నారు. ఒబామా వ్యాఖ్యలను ట్రంప్ ప్రభుత్వం అంతే దీటుగా తిప్పికొడుతోంది.

ట్రంప్ పేరు ప్రస్తావించకుండా..

'షో మి యువర్​ వాక్, హెచ్​బీసీయూ ఎడిషన్​'లో నల్లజాతి విద్యార్థులను ఉద్దేశించి ఒబామా ప్రసంగించారు. ఆశ్చర్యకరంగా పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు.

ట్రంప్ పేరు కానీ, ఇతర అధికారుల పేర్లను గానీ ప్రస్తావించకుండా... 'కొందరు అయితే కనీసం బాధ్యత వహించినట్లుగా కూడా నటించడం లేదు' అని వ్యాఖ్యానించారు.

అమెరికాలో జాతి విద్వేషం ఇంకా కొనసాగుతోందని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. జార్జియాలో ఫిబ్రవరి నెలలో జాగింగ్​కు వెళ్లిన అహ్మద్ అర్బరీ అనే 25 ఏళ్ల యువకుడిని కాల్పి చంపడాన్ని ఆయన ప్రస్తావించారు.

"నిజాయితీగా మాట్లాడుకుందాం. దేశంలో అంతర్లీనంగా అసమానతలు ఉన్నాయి. నల్లజాతి పట్ల వివక్ష ఉంది. ఈ దేశంలో ఓ నల్లజాతి వ్యక్తిని ఎవరైనా ఆపి ప్రశ్నించవచ్చు. లొంగకపోతే కాల్చి చంపవచ్చని భావిస్తారు."

- బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

ఒబామా చేసిందేమీ లేదు..

ఒబామా విమర్శలపై ట్రంప్ సర్కారు ఎప్పటికప్పుడు దీటుగా స్పందిస్తోంది. అమెరికా ఆరోగ్య రంగానికి ఒబామా చేసింది ఏమీ లేదని శ్వేతసౌధం అధికార ప్రతినిధి కైలీ మెక్ఎనానీ ఎదురుదాడి చేశారు. కరోనా లాంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు.. దాన్ని ఎదుర్కోవడానికి ఒబామా ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. ఆరోగ్య ప్రణాళిక పేరిట కేవలం ఓ కట్ట పేపర్లను శ్వేతసౌధంలో వదిలి వెళ్లారని ఆమె విమర్శించారు.

ట్రంప్ ప్రభుత్వం 2018లోనే అప్రమత్తమైందని... సంక్షోభ నివారణకు ఓ మంచి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించిందని కైలీ మెక్ఎనానీ పేర్కొన్నారు. 'క్రిమ్సన్ అంటువ్యాధి-2019'ని కూడా ఎదుర్కొందని ఆమె గుర్తుచేశారు.

కైలీ మెక్​ఎనానీ విలేకరుల ముందు ట్రంప్ ఆరోగ్య ప్రణాళికను కూడా ప్రదర్శించారు. అయితే ఒబామా ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య ప్రణాళికను మాత్రం చూపించడానికి ఆమె నిరాకరించారు.

ఒబామాపై ట్రంప్ విమర్శలు

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ పదేపదే విమర్శలు చేస్తున్నారు. కరోనా లాంటి విపత్తులు ఎదుర్కోవడానికి ఒబామా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. ఫలితంగా అవసరమైన వైద్య సామగ్రి, యంత్రాలు లేకుండా పోయాయని అంటున్నారు.

ట్రంప్​ గతంలో తనపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని ఒబామా.. ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న జో బిడెన్​ను మద్దతు కూడా ప్రకటించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​కు స్వస్తి.. పర్యటక రంగం ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.