ETV Bharat / international

కరోనా టీకా సామర్థ్యం ఎలా ఉందంటే..!

కరోనాను ఎదుర్కొనే దిశగా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి జరుగుతోంది. ఇప్పటికే ఫైజర్​, మోడెర్నా వ్యాక్సిన్లు క్లినికల్​ ట్రయల్స్​లో 90శాతానిపైగా కచ్చితత్వంతో దూసుకుపోతున్నాయి. అయితే ఆయా టీకాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకుందాం.

What does COVID-19 vaccine effectiveness mean?
కరోనా టీకా సామర్థ్యం ఎలా ఉందంటే..!
author img

By

Published : Nov 17, 2020, 5:19 PM IST

గడిచిన సంవత్సరం నుంచి మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ రూపకల్పన చివరిదశకు చేరుకుంది. సాధారణంగా ఏదైనా టీకా అభివృద్ధికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. కానీ, ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఒక్క సంవత్సరం వ్యవధిలోనే టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి జరుగుతోంది.

దూసుకెళ్తున్న టీకాలు:

దీనిలో భాగంగా ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 90శాతం సమర్థత కలిగినట్లు ఈమధ్యే వెల్లడైంది. ఇక, మోడెర్నా కూడా తమ వ్యాక్సిన్‌కు దాదాపు 94.5శాతం సమర్థత ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు పదికిపైగా టీకాలు క్లినికల్‌ ట్రయల్స్‌లో తుది దశకు చేరుకోగా, వీటిలో ఈరెండు టీకాలు మాత్రమే వాటి సమర్థతపై మధ్యంతర ఫలితాల నివేదికలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోలియో, ఫ్లూ, మిజిల్స్‌, చికెన్‌ఫాక్స్‌ వంటి వ్యాధుల నిరోధక టీకాల ప్రభావంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ సమర్థత కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కనీసం 50శాతం సమర్థత ఉంటే చాలు..!

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కనీసం 50శాతం పనితీరు కనబరిచే ఏ టీకాకైనా అనుమతి ఇస్తామని అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) ఇదివరకే వెల్లడించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా నిపుణులు మాత్రం 70శాతం కంటే ఎక్కువ సమర్థతను కలిగి వుంటే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఈ సమయంలో దాదాపు 90శాతానికి పైగా పనితీరును కనబరచడం ఎంతో అద్భుతమైన విషయమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ప్రశంసల వర్షం కురిపించడం కరోనా వ్యాక్సిన్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయి.

సాధారణంగా వివిధ వైరస్‌లను ఎదుర్కోవడం కోసం రూపొందించిన ఒక్కో వ్యాక్సిన్‌ ఒక్కో విధమైన సమర్థతను కలిగివుంటుంది. ఉదహరణకు సీజనల్‌ ఫ్లూ కోసం వాడే టీకా కేవలం దాదాపు 60 శాతం సమర్థతను మాత్రమే కలిగిఉండగా, పోలియో వంటి వ్యాక్సిన్‌ దాదాపు 100శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. ఇన్‌ఫ్లుయెంజా ఫ్లూ నిరోధక టీకా 44శాతం సమర్థత కలిగివుండగా, చికెన్‌ ఫాక్స్‌ (92శాతం), మిజిల్స్‌ (97శాతం)తో పోలిస్తే ఫైజర్‌ (90శాతం), మోడెర్నా (94.5శాతం) పనితీరు మెరుగుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

టీకా ప్రభావం ఎలా అంచనా వేస్తారంటే..?

పోలియో మహమ్మారి నిర్మూలన కోసం గడిచిన ఆరు దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. ఇందుకోసం విస్తృత టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, టీకా ప్రభావాన్ని అంచనా వేయటానికి శాస్త్రవేత్తలకు చాలా సమయం పట్టింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే టీకా పొందని వారిలో ఎంతమంది దీని‌ బారినపడ్డారో అన్న విషయం ద్వారా మాత్రమే టీకా‌ పనితీరును అంచనా వేశారు. పోలియో బారినపడే వారి సంఖ్య ఎంత తగ్గితే టీకా అంత సమర్థవంతంగా పనిచేస్తుందనే నిర్ధారణకు వచ్చారు.

ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఫైజర్‌, మోడెర్నాలు టీకా పనితీరును కేవలం క్లినికల్‌ ట్రయల్స్‌లో వెలుబడిన ప్రాథమిక ఫలితాల ఆధారంగా మాత్రమే వెల్లడించాయి. వీటినే వ్యాక్సిన్‌ సమర్థతగా వ్యవహరిస్తుంటారు. ఒకవేళ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత వారిలో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందోననే అంచనాను మాత్రమే ఇది తెలియజేస్తుంది. మోడెర్నా ప్రకటనను తీసుకుంటే.. మూడోదశ ప్రయోగాల్లో 30వేల మందిపై ట్రయల్స్‌ జరుపగా కేవలం 95 కేసులను విశ్లేషించింది. ఇందులో దాదాపు 90కేసులు ప్లెసిబో వ్యాక్సిన్‌ పొందినవారే ఉండగా, కేవలం ఐదు కేసుల్లో మాత్రమే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ ఇచ్చారు. వ్యాక్సిన్‌ పొందిన వారిలో కరోనా స్వల్ప లక్షణాలను టీకా సమర్థవంతంగా నిరోధించినట్లు మోడెర్నా గుర్తించింది. ప్లెసిబో గ్రూపుకు చెందిన 11కేసుల్లో తీవ్రమైన కరోనా లక్షణాలు గుర్తించగా ప్రయోగ టీకా తీసుకున్న వారిలో ఎవ్వరికీ వైరస్‌ సోకలేదని తెలిపింది. ఇక ఫైజర్‌ తయారుచేసిన టీకా, స్వల్ప లక్షణాలున్న వారిలో వైరస్‌ను నిరోధిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ప్రయోగ దశల్లో వ్యాక్సిన్‌ల పనితీరును అంచనా వేస్తున్నారు.

కొవిడ్‌ టీకాకు సమర్థత ఎక్కువే..?

సాధారణంగా చాలా రకాల వైరస్‌లు అతి తొందరగా మ్యుటేషన్‌ చెందుతాయి. దీంతో ప్రతి ఏటా లేదా కొంతకాలం తర్వాత మరో కొత్త టీకా తయారుచేయాల్సి వస్తుంది. ఫ్లూ విషయంలో ఇదే జరుగుతోంది. కానీ, కరోనా విషయంలో మాత్రం వైరస్‌ మ్యుటేషన్‌ కాస్త మెల్లగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వ్యాక్సిన్‌ సమర్థత కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు డోసుల టీకాలు..

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న టీకాలను రెండు డోసుల్లో ప్రయోగాలు జరుపుతున్నారు. మోడెర్నా టీకాకు నెల రోజుల వ్యవధిలో ఇవ్వగా, ఫైజర్‌ టీకా మాత్రం మూడు వారాల్లో రెండో డోసు ఇచ్చి ప్రయోగాలు చేసింది. ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ & జాన్సన్‌, కూడా ఇదే తరహాలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మిజిల్స్‌ను నిరోధించే టీకా కూడా రెండు డోసుల్లో ఇస్తున్నారు. సింగిల్‌ డోసు దాదాపు 93శాతం ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ మరోడోసు వల్ల 97శాతం నిరోధిస్తుందని గుర్తించారు. అందుకే చాలా రకాల టీకాలను రెండు డోసుల్లో ఇచ్చే విధానం కొనసాగుతోంది.

ఇదిలాఉంటే, మోడెర్నా, ఫైజర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను ఇంకా ప్రచురించలేదు. వీటిని నేరుగా నియంత్రణ సంస్థలకే నివేదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ఈ రెండు టీకాలు అతి త్వరలోనే అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.