ETV Bharat / international

Biden Taiwan: తైవాన్​పై అమెరికా- చైనా మాటల యుద్ధం - అంతర్జాతీయ వార్తలు

తైవాన్​పై చైనా దాడికి దిగితే తాము రంగంలోకి దిగుతామని కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​(Biden taiwan). తమ సైనిక బలమేంటో చైనా, రష్యా సహా అన్ని దేశాలకు తెలుసన్నారు. దీనిపై స్పందించిన చైనా.. బైడెన్​కు(biden news) కౌంటర్ ఇచ్చింది. తైవాన్ విషయంలో(taiwan china news) తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

china-russia-aware-of-us-military-might-will-defend-taiwan-biden
తైవాన్​పై బైడెన్ కీలక వ్యాఖ్యలు- చైనా కౌంటర్​
author img

By

Published : Oct 22, 2021, 3:18 PM IST

Updated : Oct 22, 2021, 4:28 PM IST

తైవాన్‌ విషయంలో (Taiwan news ) అగ్రదేశాలు అమెరికా, చైనాల మాటల యుద్ధం తీవ్రమైంది. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను (Taiwan China news) తాము రక్షిస్తామని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్(biden taiwan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్‌ ఉందని వెల్లడించారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో భాగంగా బైడెన్‌ (Biden news) ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ తెలుసు.. తాము ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని' ఆయన పేర్కొన్నారు.

మరోవైపు తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీల్లో ఎటువంటి మార్పులు లేవని వైట్‌హౌస్‌ అధికారులు స్పష్టం చేశారు. తైవాన్‌ విషయంలో చైనా (Taiwan news china) కొన్నాళ్లుగా దుందుడుకు ధోరణి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తైవాన్‌ను తమ భూమిగా పేర్కొంటూ.. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తైవాన్‌ గగనతలంలోకి ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించింది. కొన్నాళ్లుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్‌- చైనాలను ఏకం చేసి తీరతామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సైతం వ్యాఖ్యానించారు. మరోవైపు తైవాన్‌ సైతం డ్రాగన్‌ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గమని తేల్చి చెబుతూ వస్తోంది.

చైనా కౌంటర్​..

బైడెన్​ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. తైవాన్ విషయంలో అమెరికా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. తమ కీలక ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తేల్చి చెప్పారు. తైవాన్‌ (China Taiwan war) తమ భూభాగమని, అవసరమైతే బలవంతంగా ఏదో ఒక విధంగా ఆ ద్వీపాన్ని హస్తగతం చేసుకుంటామని చైనా అధికారవర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: చైనా 'బొమ్మ'ల్లో ప్రమాదకర రసాయనాలు- భారత్​ జాగ్రత్త!

Last Updated : Oct 22, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.