అధికారం చేపట్టినప్పటి నుంచి తాత్కాలిక నివాసంలోనే ఉంటున్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు తన అధికారిక నివాసంలోకి వెళ్లనున్నారు. ఈ వారంలో ఆమె తన భర్త డగ్ ఎమ్హోఫ్తో కలిసి ఉపాధ్యక్షుల కోసం కేటాయించిన భవనం(నావల్ అబ్జర్వేటరీ)లోకి మారనున్నారు. ఇటీవలే అధికారిక భవనంలో మరమ్మతులు పూర్తి అయ్యాయి.
నావల్ అబ్జర్వేటరీలో ప్లంబింగ్, హీటింగ్, ఎయిర్ కండీషనింగ్‌కు సంబంధించిన మరమ్మతులు జరిగాయి. అంతకుముందు ఈ భవనంలో ఉన్న మైక్ పెన్స్ దంపతులు ఖాళీ చేసి వెళ్లాక.. మరమ్మతు పనులు సులభంగా చేయగలిగామని అధికారులు తెలిపారు.
జనవరి 20న అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు కమల. అదే రోజున.. అధ్యక్షుడికి కేటాయించే అధికార నివాసం శ్వేతసౌధానికి వెళ్లిపోయారు బైడెన్. కానీ కమల మాత్రం.. తన భర్త డాగ్లస్ ఎమ్హోఫ్తో కలిసి.. రెండు నెలలుగా అధ్యక్షుడి అధికార అతిథి గృహమైన బ్లెయిర్ హౌస్‌లోనే ఉంటున్నారు.
ఇదీ చూడండి:భారత ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలిక నిషేధం!