ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ పనికిరారు: ఒబామా - 'అధ్యక్షుడిగా ట్రంప్​ను ఎన్నుకోవడం తప్పు ఎంపిక'

దేశంలోని సమస్యలను పరిష్కరించటానికి ఎంతో సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు ఏ పనిని చేయలేకపోయారంటూ ట్రంప్​పై.. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా ​ విరుచుకుపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దే సత్తా బైడెన్​కు ఉందని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

Vote like your lives depend on it, says Michelle Obama
'మీ జీవితాలు వేసే ఓటుపైనే ఆధారపడి ఉన్నాయి'
author img

By

Published : Aug 18, 2020, 1:13 PM IST

నవంబర్​లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ దేశ మాజీ ప్రథమ మహిళ, బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఓటుపైనే మీ జీవితాలు ఆధారపడి ఉన్నట్లు భావించి బైడెన్​కు ఓటేయాలి' అని అమెరికా ప్రజలను ఉద్దేశించి డెమొక్రటిక్​ జాతీయ సదస్సులో మాట్లాడారు.

దేశంలోని సమస్యలను పరిష్కరించటానికి ఎంతో సమయం ఉన్నప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు ఆ పనిని సక్రమంగా నిర్వహించలేకపోయారంటూ ట్రంప్​పై మిషెల్లీ విరుచుకుపడ్డారు. అమెరికాకు ట్రంప్​ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఓ తప్పుడు ఎంపికగా అభివర్ణించారు. పరిస్థితులు మరింత దిగజారిపోకుండా చక్కదిద్దే సత్తా ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. ట్రంప్​ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విదేశాంగ విధానం వంటి ఇతర విధానాలకు తూట్లు పొడిచినట్లు ఆరోపించారు మిషెల్లీ.

ఈ సందర్భంగా డెమొక్రటిక్​ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్​పై ప్రశంసల వర్షం కురిపించారు​. ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

"గతంలో బరాక్​ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పడు రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా పదవిని నిర్వహించారు బైడెన్. నిజంగా ఆయన చాలా సమర్థత గల వ్యక్తి. ఆర్థిక వ్యవస్థను కాపాడటం, మహమ్మారిని పాలదోలటంతో పాటు, దేశాన్ని ముందుండి నడిపించగల సత్తా ఆయనకు ఉంది."

- మిషెల్లీ ఒబామా, అమెరికా మాజీ ప్రథమ మహిళ

డొనాల్డ్​ ట్రంప్​ గత ఎన్నికల్లో ప్రజాదరణ లేకపోయినా.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఈ సారీ అలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.