ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికలు: ముందస్తు పోలింగ్​ అంటే? - మెయిల్​ ఇన్​ బ్యాలెట్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే విధానం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 50 రాష్ట్రాలున్న యూఎస్​లో ముందస్తు పోలింగ్​ ప్రత్యేకంగా నిలుస్తుంది. పోలింగ్​ రోజుకు ముందే ఓట్లేసే ఈ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారు ? అనేది తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం మీకోసమే.

US elections polling
అధ్యక్ష ఎన్నికలు: ముందస్తు పోలింగ్​ ఎలా పని చేస్తుంది ?
author img

By

Published : Oct 5, 2020, 12:40 PM IST

హోరాహోరీగా సాగుతున్న 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల క్రతువు.. ఒక్కో పర్వం పూర్తి చేసుకుంటోంది. అభ్యర్థులిద్దరూ నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్న తరుణంలోనే కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు పోలింగ్​ జరుగుతోంది.

మొదలైన ముందస్తు పోలింగ్​..

అమెరికాలో 2020-అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నవంబర్​ 3న జరగాలి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్​ ముందే ప్రారంభమైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో ఇలాంటిది జరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్ష పోలింగ్​ జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మెయిళ్ల రూపంలో ఉంటుంది. అయితే, ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ ముందస్తు పోలింగ్​ జరుగుతుంటుంది.

ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి... కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్​లోనే మొదలైంది పోలింగ్​. మరికొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్​ మధ్యలో, నవంబర్​లో​ పోలింగ్​ రోజుకు ముందు జరుగుతాయి.

లెక్కింపు మార్గాలు

ముందస్తు ఓట్లు వేసేందుకు 50 వేర్వేరు మార్గాలు ఉన్నట్లే.. ఈ ఓట్ల లెక్కింపునకు సైతం విభిన్న అవకాశాలున్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు మెయిల్​ ఇన్​ బ్యాలెట్​ విధానాన్ని అనుసరిస్తాయి. ఓటింగ్​లో భాగంగా వచ్చిన ఎన్వలప్​లను తెరిచి.. ఓటర్ల సంతకం సహా అన్ని అంశాలు సరిచూసుకుంటారు. పట్టిక కోసం బ్యాలెట్లను సరైన పద్ధతిలో క్రమబద్ధీకరిస్తారు. ఈ ప్రక్రియ పోలింగ్​ రోజుకు 3 వారాల ముందే మొదలవుతుంది.

మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్​ రోజే.. ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. చాలాసార్లు సమయాభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

డెమొక్రాట్ల అభ్యంతరాలు

ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని కీలకమైన రాష్ట్రాలో ఇందే పంథా అనుసరిస్తున్నారు. ఈ అంశంపై డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిల్ ఇన్​ బ్యాలెట్ విధానం వల్ల.. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. తమకు మద్దతున్న చోట్ల.. లెక్కింపు ఆలస్యం కావటం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆసుపత్రిలో ట్రంప్- కోలుకోవాలని ఆకాంక్షించిన కిమ్​

ఇదీ చూడండి: 'కరోనా' కథ మార్చేనా..! ట్రంప్​కు వైరస్‌ సోకడంపై సర్వత్రా చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.