దేశ రాజధాని కారకస్‌లో రోడ్ల వెంట దుకాణాలన్నీ తిరిగినా... బాటిల్ నీరు దొరకని దుస్థితి. నగరంలోని కొండలపై నుంచి వచ్చే నీటిని పట్టుకోవటానికి గంటల పాటు సమయం వెచ్చించాల్సి వస్తోంది.
"నీరు పట్టుకోవటానికి నేను ఇక్కడికి వచ్చి కొన్ని గంటల పాటు వేచి ఉన్నాను. మేము నీటి కోసమే ప్రత్యేకించి ఉన్నాము. చిన్నపిల్లలకు ఆహారం అందించాలి. మాకోసం ఆహారం తయారు చేసుకోవాలి."
- జోస్ రిన్కోన్, కారకస్ స్థానికుడు
విద్యుత్ సంక్షోభంతో పాఠశాలలు, కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. కాలినడకనే కార్యాలయాలకు వెళుతున్నారు.
ఇదీ చూడండీ: విద్యుత్ సంక్షోభంతో మరోసారి అంధకారంలో వెనెజువెలా