కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. కార్యాలయాలు, దుకాణాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు కాలి నడకనే ఇళ్లకు చేరుకుంటున్నారు.
" ఆహార పదార్థాలు పాడవుతాయని బాధగా ఉంది. విద్యుత్ సరఫరా లేకుంటే కార్డు రీడర్లు పని చేయవు. అందుకే దుకాణాలు తెరవడం లేదు. ఇది వెనెజువెలాలో ప్రతి పౌరుడి సమస్యగా భావిస్తున్నాం. రాజకీయాలకు తావివ్వకుండా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది."
-హెర్నాడెజ్, పండ్ల దుకాణం యజమాని
అమెరికా ప్రోత్సాహంతో ప్రతిపక్ష మద్దతుదార్లు పవర్ గ్రిడ్‌పై మాగ్నటిక్ దాడులు చేయటమేక్రితంసారి విద్యుత్ సంక్షోభానికికారణమని అధ్యక్షుడు మదురో ఆరోపించారు. ఈ సారి ఇంకా కారణాలు తెలపలేదు.
" ఇది చాలా విపత్కర పరిస్థితి. దేవుడిపై నమ్మకముంది. విద్యుత్ సమస్య తాత్కాలికమే అవ్వాలని ఆశిస్తున్నాం. గతంలో మాదిరిగా కొన్ని రోజుల పాటు ఉండకూడదు. అతి త్వరగా పరిస్థితిని చక్కదిద్దుతారని ఆశిస్తున్నాం."
-కార్మెన్ ఏరియాస్, సెక్రెటరీ
ప్రస్తుత గందరగోళ పరిస్థితికి ప్రభుత్వ అసమర్థతే కారణమని విద్యుత్ నిపుణులు, ప్రతిపక్ష నేత జువాన్ గయిడో ఆరోపిస్తున్నారు.
రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, విద్యుత్ సంక్షోభంతో వెనెజువెలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.