ETV Bharat / international

'మా అవసరాలు తీరాకే ఇతర దేశాలకు టీకా'

author img

By

Published : Mar 11, 2021, 10:49 AM IST

తమ అవసరాలకు మించి టీకాల ఉత్పత్తి జరిగితే ప్రపంచదేశాలకు అందిస్తామని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికన్ల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు కరోనా టీకా అందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

US will share COVID-19 vaccine if it has surplus: Biden
'మా అవసరాలు తీరాకే ఇతర దేశాలకు టీకా'

అమెరికా అవసరాలకు మించి అదనంగా కొవిడ్ టీకా ఉత్పత్తి జరిగితే.. వాటిని ప్రపంచ దేశాలకు అందిస్తామని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా కొవాక్స్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు 400 కోట్ల డాలర్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.

అమెరికన్ల రక్షణకే ప్రాధాన్యం..

గోడలు కట్టడం ద్వారా ఆ మహమ్మారి నుంచి రక్షణ పొందలేమని ఆ గోడ ఎంతదైనా ప్రపంచం మొత్తం సురక్షితంగా మారేవరకూ ఎవరూ తప్పించుకోలేరని బైడెన్ అన్నారు. అందుకే ముందు అమెరికన్ల రక్షణకు ప్రాధాన్యమిస్తామని అ తర్వాత ప్రపంచదేశాలకు కూడా అండగా నిలబడతామని బైడెన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో జాన్సన్ అండ్ జాన్సన్‌.. మెర్క్ మధ్య కుదిరిన భాగస్వామ్యాన్ని ప్రశంసించిన బైడెన్.. తద్వారా అమెరికాలో మరో 10 కోట్ల డోస్‌ల టీకా అదనపు ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.

ఫైజర్‌, మోడెర్నా సంస్థలు కూడా టీకా సరఫరాలో కలిసి పనిచేయడాన్ని స్వాగతించారు.

ఇదీ చదవండి: 'కరోనా ప్యాకేజీ' బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.