అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి 554కు చేరింది. వైరస్ లక్షణాలతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21కు చేరింది. 3,500మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కాలిఫోర్నియాలో జరగనున్న టెన్నిస్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
వేగంగా విస్తరిస్తున్న వైరస్ వ్యాప్తిని నివారించడంలో విఫలమైనట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చర్యలను వేగవంతం చేశారు అధికారులు.
30 రాష్ట్రాల్లో వైరస్..
అమెరికాలోని 30 రాష్ట్రాలకు కరోనా వ్యాపించినట్లు సమాచారం. ఇప్పటికే ఒరెగాన్ రాష్ట్రం ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. కాలిఫోర్నియా, న్యూయార్క్‌లోని 6 కోట్లమంది ప్రజలు కరోనా కారణంగా భయాందోళనకు గురవుతున్నారు.
పరీక్షించిన తర్వాతే దేశంలోకి..
రీగల్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ ఫ్లోరిడా ఫోర్ట్ లాడర్డల్లోని ఓడరేవులోకి ఆదివారం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఫ్లోరిడా తీరంలోని ఈ నౌకలో ఉన్న వారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసిన తర్వాతే దేశంలోకి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాలిఫోర్నియాలో గ్రాండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ నుంచి రెండు వారాల క్రితం కొంతమందిని రీగల్ షిప్‌లోకి తరలించారు. ఆ తర్వాత అందులో పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి వైరస్ లక్షణాలునట్లు నిర్ధరించారు వైద్యులు.
ఇదీ చూడండి: కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి