అగ్రరాజ్యం అమెరికా వాణిజ్యలోటు ఆగస్టులో 14 ఏళ్ల గరిష్ఠానికి పెరిగినట్లు అధికారిక గణాంకాల్లో తేలింది.
అమెరికా వస్తు సేవల విక్రయాలు.. విదేశాల నుంచి కొనుగోళ్ల మధ్య అంతరం ఆగస్టులో 5.9 శాతం పెరిగినట్లు ఆ దేశ వాణిజ్య విభాగం వెల్లడించింది. దీని విలువ 67.1 బిలియన్ డాలర్లుగా తెలిపింది. ఎనిమిదో నెలలో అగ్రరాజ్యానికి ఈ స్థాయిలో వాణిజ్య లోటు ఏర్పడటం 2006 ఆగస్టు తర్వాత ఇదే ప్రథమం.
ఆగస్టులో ఎగుమతి, దిగుమతులు ఇలా..
అమెరికా ఎగుమతులు ఆగస్టులో 2.2 శాతం పెరిగి.. 171.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు అత్యధికంగా 3.2 శాతం పెరిగి 239 బిలియన్ డాలర్లుగా నమోదవ్వడం వల్ల వాణిజ్య లోటు భారీగా పెరిగింది.
ఇదీ చూడండి:ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్: డబ్ల్యూహెచ్ఓ