ETV Bharat / international

టీకా కోసం భారత్​లో 'క్వాడ్' పెట్టుబడులు! - క్వాడ్ కరోనా టీకా

క్వాడ్ దేశాధినేతల భేటీలో కరోనా వ్యాక్సినేషన్​ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం కలిసి పనిచేయాలని నాలుగు దేశాల అధినేతలు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం భారత్​లోని టీకా తయారీ సామర్థ్యాలను వినియోగించుకోవాలని సంకల్పించుకున్నారు. అలాగే.. త్వరలోనే భౌతికంగా చర్చలు జరపాలనీ నిర్ణయించుకున్నారు.

US to provide financial assistance to India for vaccine manufacturing
టీకా తయారీ కోసం భారత్​లో 'క్వాడ్' పెట్టుబడులు!
author img

By

Published : Mar 13, 2021, 5:38 AM IST

తొలిసారి భేటీ అయిన 'క్వాడ్' దేశాధినేతలు.. కరోనా టీకా తయారీ, పంపిణీపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ఆర్థిక వనరులతో పాటు, తయారీ సామర్థ్యాలు, లాజిస్టిక్స్ తదితర అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా తయారీదారు అయిన భారత్​లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అవగాహనకు వచ్చారు. అదనపు డోసులను వేగంగా తయారు చేసి, ఇండో పసిఫిక్ అవసరాలను తీర్చేందుకు ఈ ప్రణాళికలు చేపట్టారు.

"భారతదేశ టీకా తయారీ సామర్థ్యాలు, అమెరికా సాంకేతికత, ఆస్ట్రేలియా లాజిస్టిక్స్ వసతులు, జపాన్-అమెరికా ఆర్థిక సహకారాన్ని ఉపయోగించుకొని.. 'క్వాడ్' కూటమి వంద కోట్ల డోసులను తయారు చేసేందుకు కట్టుబడి ఉంది. వచ్చే ఏడాదిలోపు వీటిని ఆసియాన్, ఇండో పసిఫిక్ దేశాలకు సరఫరా చేస్తాం."

-జేక్ సులివన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు

త్వరలోనే ప్రత్యక్ష భేటీ

నాలుగు దేశాల అధినేతలు ఈ ఏడాదిలోనే ప్రత్యక్షంగా సమావేశమవుతారని జేక్ స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్​లో ప్రాంతీయంగా ఉన్న సమస్యలపై నేతలు చర్చించినట్లు తెలిపారు. నేవిగేషన్, దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో స్వేచ్ఛ, ఉత్తర కొరియా న్యూక్లియర్ సమస్య, మయన్మార్ సైనిక తిరుగుబాటుపై సమాలోచనలు చేసినట్లు వెల్లడించారు.

కాగా, భారత డ్రగ్ తయారీ సంస్థ 'బయోలాజికల్ ఇ'కు అమెరికా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. ఈ సంస్థ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాలను పెంచేందుకు అమెరికాకు చెందిన డెవలప్​మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పనిచేయనున్నట్లు వెల్లడించింది.

మా ఖ్యాతికి గుర్తింపు: భారత్

మరోవైపు, వ్యాక్సిన్ విషయంలో క్వాడ్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా స్పష్టం చేశారు. క్వాడ్ కూటమి భేటీ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. 2020 చివరి నాటికి వంద కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇండో పసిఫిక్​లో టీకా పంపిణీ కోసం సహకరించుకోవాలని అవగాహనకు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది దేశీయ పంపిణీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు.

"ఇండో పసిఫిక్ ప్రాంతంలో కరోనా టీకా పంపిణీ వేగవంతం చేయడానికి కలిసి పనిచేయాలని నలుగురు దేశాధినేతలు నిర్ణయించారు. దీన్ని భారత్ స్వాగతిస్తోంది. ఈ నిర్ణయం మా టీకా తయారీ సామర్థ్యాలను గుర్తిస్తోంది. నాణ్యమైన టీకాలు తయారు చేస్తున్న మా ఖ్యాతికి ఇది ధ్రువీకరణ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాం."

-హర్షవర్ధన్ శ్రింగ్లా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి

సమకాలీన సమస్యలపై క్వాడ్ దేశాలు చర్చించాయని శ్రింగ్లా తెలిపారు. అదే సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల అంశంపైనా దృష్టిసారించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ఇండో-పసిఫిక్​లో శాంతి, సుస్థిరతకు క్వాడ్ కీలక పాత్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.