ETV Bharat / international

ఇరాన్​పై ఆంక్షలకు సిద్ధం- దాడులపై తర్జనభర్జన

ఇరాన్​పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్య చేపట్టే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి పలకాల్సిందేనని ఇరాన్​ను హెచ్చరించారు.

author img

By

Published : Jun 23, 2019, 11:30 AM IST

Updated : Jun 23, 2019, 1:02 PM IST

ఇరాన్​పై మరిని ఆంక్షలు విధిస్తాం: ట్రంప్
ఇరాన్​పై ఆంక్షలకు సిద్ధం- దాడులపై తర్జనభర్జన

ఇరాన్​పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ కీలక ఆంక్షలు సోమవారం అమల్లోకి రానున్నాయి. అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి పలికితే ఇరాన్​కు తాను మంచి స్నేహితుడిగా ఉంటానన్న కొన్ని గంటలకే నూతన ఆంక్షలను ప్రకటించారు ట్రంప్.

"సోమవారం ఇరాన్​పై అదనపు ఆంక్షలు విధించనున్నాము. ఆంక్షల నుంచి ఇరాన్ బయటపడే రోజు కోసం ఎదురుచూస్తున్నా. అప్పుడు ఆ దేశం మళ్లీ సుసంపన్నంగా మారుతుంది. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది."- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

సైనిక చర్య...

తమ గగనతలంలోకి అక్రమ చొరబడిందనే నెపంతో అమెరికా నిఘా డ్రోన్​ను ఇరాన్ కూల్చివేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ విషయంపై మండిపడ్డ ట్రంప్​... ఇరాన్​పై సైనిక చర్య చేపట్టే అంశాన్ని ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ అంశం తమ ప్రాధాన్యాంశాల్లో ఉంటుందని హెచ్చరించారు.

150 మంది ఇరాన్​ ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే కారణంగానే గురువారం చేపట్టాలని భావించిన సైనిక చర్యను నిలిపివేశానని ట్రంప్ తెలిపారు.

"150 మంది ఇరాన్ ప్రజలను చంపాలని నేను కోరుకోవడం లేదు. అవసరమైతే తప్ప ఎవరినీ చంపడానికి నేను ఇష్టపడను." -డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇరాన్​ నిరసన..

30 మంది ప్రయాణిస్తున్న యూఎస్​ నిఘా విమానాన్ని కూల్చకూడదని ఇరాన్ సైన్యం తీసుకన్న నిర్ణయాన్ని అభినందనిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. అయితే తమ నిఘా డ్రోన్ అంతర్జాతీయ గగనతలంలో ఉన్నప్పుడే ఇరాన్ కూల్చివేసిందని ట్రంప్ పునరుద్ఘాటించారు.

అమెరికా డ్రోన్​లను ప్రయోగించడానికి అనుమతించాలని నిర్ణయం తీసకున్న పొరుగు అరబ్​ దేశంపై ఇరాన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఏఈ ప్రతినిధిని టెహ్రాన్​కు పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్​పై సైనిక చర్య అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు.

ఇరాన్​ దూకుడుగా వ్యవహరిస్తుండటం వల్ల యుద్ధం జరిగే అవకాశముందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇదీ చూడండి: ఇరాన్ నిఘా కేంద్రాల​పై అమెరికా సైబర్​ దాడి

AP Video Delivery Log - 0200 GMT News
Sunday, 23 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0144: US Immigration Tweets AP Clients Only 4217142
Trump delays immigration enforcement operation
AP-APTN-0111: STILLS US Motorcycle Crash Part must credit Miranda Thompson; 14 days news use only; No archive; No licensing 4217141
Seven dead as pickup truck hits motorbikers in US
AP-APTN-0054: US Shooting Bodycam Must credit Sacramento Police Department 4217134
Video of US shooting that left rookie officer dead
AP-APTN-0050: Venezuela Guaido AP Clients Only 4217140
Guaido visits farmers, comments on Bachelet visit
AP-APTN-0044: Chile Gay Pride AP Clients Only 4217139
Tens of thousands join Pride parade in Santiago
AP-APTN-0031: STILL North Korea US No access Japan until 14 days after date of transmission 4217138
Still reportedly shows Kim reading Trump letter
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 23, 2019, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.