ETV Bharat / international

'ఇరాన్​ జాగ్రత్త.. ఆ 52 ప్రాంతాల్లో దాడి చేస్తాం'

author img

By

Published : Jan 5, 2020, 6:11 AM IST

Updated : Jan 5, 2020, 7:56 AM IST

ఇరాన్​కు చెందిన 52 స్థలాలను లక్ష్యంగా చేసుకున్నామని.. అవసరమైతే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. తమ పౌరులకు హాని కలిగితే సహించబోమని స్పష్టం చేశారు. ట్రంప్​ వ్యాఖ్యలతో అమెరికా-ఇరాన్​ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత మరింత పెరిగింది.

US targeting 52 Iranian sites if Tehran attacks Americans: Trump
'ఇరాన్​ జాగ్రత్త.. ఆ 52 ప్రాంతాల్లో దాడి చేస్తాం'

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్న వేళ.. ఇరాన్​ను మరోమారు తీవ్రంగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికన్లపైనా, అమెరికా ఆస్తులపైనా దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్​కు సంబంధించిన 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని.. వాటిపై ఎంతో వేగంగా, ఎంతో బలంగా దాడి చేయడానికి సిద్ధమని ట్వీట్​ చేశారు.

US targeting 52 Iranian sites if Tehran attacks Americans: Trump
ట్రంప్​ ట్వీట్లు

"ఇరాన్​ ఉగ్రనేత(సులేమానీ) నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాం. సులేమానీ తన జీవితంలో ఎందరినో చంపాడు. మరెందరినో గాయపరిచాడు. కానీ మాపై ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్​ అంటోంది. ఇరాన్​ ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలను సృష్టిస్తూనే ఉంది. ఆ దేశానికి ఇదొక హెచ్చరికలా ఉండాలి. అమెరికన్లకైనా, అమెరికా ఆస్తులకైనా ఇరాన్​ వల్ల నష్టం జరగకూడదు. ఒక వేళ అదే జరిగితే.. మేము ఇప్పటికే ఇరాన్​కు చెందిన 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాం. వాటిల్లో ఇరాన్​కు ముఖ్యమైనవి, చారిత్రకమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిపై ఎంతో వేగంగా, ఎంతో బలంగా దాడి చేస్తాం."
--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా దళాలే లక్ష్యంగా బగ్దాద్​లో శనివారం రాకెట్​ దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్​ ట్వీట్​ చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్​ అధికారులు స్పష్టం చేశారు.

శుక్రవారం బగ్దాద్​ విమానాశ్రయంపై అమెరికా దళాలు రాకెట్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్​ టాప్ కమాండర్​ ఖాసిం సులేమానీ మృతి చెందారు. వేకువజామున జరిగిన ఈ ఘటనలో సులేమానీ, ఇరాక్​కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మరణించారు.

ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీగా బలగాలను మోహరించింది అమెరికా.

ఇదీ చూడండి:- 'ఇరాన్​ ప్రతీకారానికి అమెరికా సిద్ధంగా ఉండాలి'

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 4 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1915: Israel Weather AP Clients Only 4247550
Two people trapped in lift die in Israel floods
AP-APTN-1905: Yemen Soleimani Reax AP Clients Only 4247553
Houthi spokesman condems US over Soleimani killing
AP-APTN-1846: Australia Wildfires Mallacoota Must credit @aims_elisha 4247552
Blood red skies amid wildfires in Mallacoota
AP-APTN-1843: Libya House of Representatives AP Clients Only 4247551
Libya UN-backed gov's Turkey pact rejected in east
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 5, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.