ETV Bharat / international

'హెచ్చరించినా వినలేదు- డ్రోన్​ను కూల్చేశాం'

అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్​కు చెందిన డ్రోన్​ను హర్మోజ్​ జలసంధి వద్ద అమెరికా యుద్ధనౌక కూల్చివేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. అయితే ట్రంప్​ ప్రకటనను ఇరాన్​ ఖండించింది. డ్రోన్​ కూల్చివేత తమ దృష్టికి రాలేదని పేర్కొంది.

'హెచ్చరించినా వినలేదు- డ్రోన్​ను కూల్చేశాం'
author img

By

Published : Jul 19, 2019, 10:47 AM IST

ఇరాన్​-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన నిఘా డ్రోన్​ను ఇరాన్​ కూల్చడం.. ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణమైంది. తాజాగా ఇరాన్​కు చెందిన ఓ డ్రోన్​ను అమెరికా యుద్ధనౌక కూల్చివేసిందంటూ ట్రంప్​ ప్రకటించడం మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది.

గురువారం అంతర్జాతీయ సముద్ర జలాల్లోని హర్మోజ్​ జలసంధి వద్ద గస్తీ కాస్తోన్న 'యూఎస్ఎస్​ బాక్సర్'​ నౌక.. సుమారు 1000 గజాల దూరంలో ఇరాన్​ డ్రోన్​ను గమనించింది. పలు మార్లు హెచ్చరించినా డ్రోన్​ను ల్యాండ్​ చేయకపోవడం వల్ల కూల్చివేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు.

"డ్రోన్​ను వెనువెంటనే కూల్చేశాం. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్న నౌకలపై ఇరాన్​ జరిపే రెచ్చగొట్టే చర్యల్లో ఇదీ ఒకటి. మా నౌకకు ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా మేం రక్షణాత్మక వైఖరితో దాడి చేశాం. మిగిలిన దేశాలూ జలసంధి వద్ద ఉన్న వారి నౌకలను జాగ్రత్తగా చూసుకోవాలి." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఖండించిన ఇరాన్​...

ట్రంప్​ వ్యాఖ్యలను ఇరాన్​ విదేశాంగ మంత్రి జావద్​ జరీఫ్ తోసిపుచ్చారు. ఇరాన్​ డ్రోన్​ కూలినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఆంక్షల మోత...

ఇరాన్​ అణు కార్యక్రమంలో భాగమైన సంస్థలు, 12 మంది వ్యక్తులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. అమెరికాలో ఉన్న వారి ఆస్తులను స్తంభింప చేస్తున్నట్లు పేర్కొంది. ఒప్పందం కుదరాలంటే... ఇరాన్​ అణ్వాయుధాల తయారీ ఆపాలని ట్రంప్​ మరోసారి హెచ్చరించారు.

"ఇరాన్​ తాజాగా చేపట్టిన ప్రమాదకర అణు కార్యక్రమాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. పరిమితులకు మించి యురేనియం నిల్వ చేయండం, 3.67 శాతం కంటే ఎక్కువ సాంద్రతను మించి యురేనియాన్ని శుద్ధి చేయడం వంటి వాటిని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు."
- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

AP Video Delivery Log - 2000 GMT News
Thursday, 18 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1930: US NY Cohen AP Clients Only 4221071
Records: Trump discussed quashing affairs stories
AP-APTN-1927: US Trump Iran AP Clients Only 4221070
Trump: US warship destroys Iranian drone
AP-APTN-1901: US Trump Netherlands AP Clients Only 4221068
Trump welcomes Dutch Prime Minister to White House
AP-APTN-1854: Haiti Weapons AP Clients Only 4221053
Weapons destroyed in Haiti in joint ceremony
AP-APTN-1848: US Election 2020 Mark Sanford AP Clients Only 4221060
Mark Sanford mulls 2020 presidential bid
AP-APTN-1847: MidEast Netanyahu AP Clients Only 4221059
Israeli PM criticises Iran and Hezbollah
AP-APTN-1838: US Trump Politics Analysis AP Clients Only 4221058
Analyst: demonizing congresswomen part of strategy
AP-APTN-1829: US NY Epstein Sketches Must Credit Aggie Kenny/AP Clients Only 4221057
Sketches show Jeffrey Epstein bail hearing
AP-APTN-1823: Lebanon Protest AP Clients Only 4221055
Scuffles near Lebanon parliament before vote on budget
AP-APTN-1821: Argentina Bombing Anniversary AP Clients Only 4221054
AMIA memorial service held 25 years after terrorist attack
AP-APTN-1808: Philippines Police AP Clients Only 4221052
Philippines police punished for drug raid deaths
AP-APTN-1801: Germany Lavrov AP Clients Only 4221031
Lavrov voices concern over Iran, blames US for tensions
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.