ఇండో పసిఫిక్ ప్రాంతంలో(indo pacific region) భద్రతా భాగస్వామ్యం కోసం ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్లతో కలిసి ఇటీవల ఏర్పాటు చేసిన కూటమి 'ఆకస్'లో(aukus alliance) భారత్ లేదా జపాన్ను చేర్చుకోవటాన్ని తోసిపుచ్చింది అమెరికా. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అలాగే.. ఈ కూటమిపై ఫ్రాన్స్ ఆరోపణలను సైతం తిప్పికొట్టింది.
అమెరికాలో తొలిసారి నేరుగా క్వాడ్ సమావేశం(quad summit 2021) జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరుకానున్న భారత్, జపాన్ వంటి దేశాలను కొత్త కూటమిలో(aukus alliance) చేర్చుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జాన్ సాకీ.
" గత వారం ప్రకటించిన ఆకస్ కూటమి కేవలం ఒక సంకేతం కాదు. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతలో పాల్గొనేవారు మరెవరూ లేరని చెప్పే సందేశం. ఈ సందేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్‌కు సైతం అధ్యక్షుడు బైడెన్ తెలిపారని భావిస్తున్నా. నిజానికి ఇది ఫ్రాన్స్‌తో మాట్లాడేందుకు ముఖ్యమైన అంశం. "
- జెన్ సాకీ, శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో(indo pacific region) చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలు త్రైపాక్షిక భద్రతా కూటమిని(aukus alliance) ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సామర్థ్యం గల జలాంతర్గాములను అభివృద్ధి చేసే సాంకేతికతను అమెరికా, యూకేలు అందించనున్నాయి. ఈ కూటమిని సెప్టెంబర్ 15న మూడు దేశాల అధినేతలు ప్రకటించారు.
ఇదీ చూడండి: చైనాకు దీటుగా.. ఆ మూడు దేశాల కొత్త కూటమి