తాలిబన్ల చెరలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. అయితే.. తాలిబన్ల ఆక్రమణ అనంతరం.. అఫ్గాన్‌లో చిక్కుకున్న అమెరికన్లకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుంచి ముప్పు పెరిగిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులను కాబూల్ విమానాశ్రయానికి తరలించేందుకు యూఎస్ భద్రతా దళం కొత్త మార్గాలను అన్వేషించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఈ మేరకు అమెరికా పౌరులను, అధికారులను రహస్యంగా తరలించే మార్గాలు భద్రతా దళాలు చెబుతున్నాయని అధికారి వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ అధికారి అనుమతి ఉంటేనే పౌరులు కాబూల్ విమానాశ్రయానికి వెళ్లాలని యూఎస్ దౌత్యకార్యాలయం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారి మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇప్పటివరకైతే ఐఎస్ గ్రూప్ పౌరులపై ఎలాంటి దాడిచేయలేదని అధికారి తెలిపారు. కానీ, వారి నుంచి ముప్పు ఉందన్న మాట మాత్రం వాస్తవేమనని స్పష్టం చేశారు.
బైడెన్ స్పందన...
అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తమ జాతీయ భద్రతా బృందం సభ్యులు అక్కడి పరిస్థితులు ఆయనకు వివరించారని వైట్ హౌస్ పేర్కొంది.
అఫ్గాన్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సహా భద్రతా పరిస్థితి, ఉగ్రవాద నిరోధక చర్యలపై చర్చించడానికి.. బైడెన్, అతని బృందం శనివారం వైట్ హౌస్‌లో సమావేశమైంది. ప్రయాణికుల తరలింపు కోసం రవాణా కేంద్రాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న దేశాలతో ఒప్పందం విషయంపై చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది. సింగపూర్ పర్యటనలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: