ETV Bharat / international

'కరోనాను ఎదుర్కొనే సమర్థత ఫైజర్​కు ఉంది' - FDA report on Pfizer vaccine

కొవిడ్​ బారి నుంచి ఫైజర్​ టీకా సమర్థంగా కాపాడుతుందని అమెరికా ఆహార ఔషధ పరిపాలనా సంస్థ (ఎఫ్​డీఏ) తెలిపింది. ఈ మేరకు టీకాపై పరీక్షలు నిర్వహించి విశ్లేషణను తొలిసారిగా ఆన్​లైన్​ ఉంచింది ఎఫ్​డీఏ.

U.S. regulators post positive review of Pfizer vaccine data
'కరోనాను ఫైజర్​ టీకా సమర్థంగా ఎదుర్కొగలదు'
author img

By

Published : Dec 8, 2020, 8:07 PM IST

కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా ఔషధ తయారీ సంస్ధ ఫైజర్‌, జర్మనీ సంస్ధ బయో ఎన్​టెక్‌ రూపొందించిన టీకా సురక్షితమైనదే అని అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా సంస్ధ (ఎఫ్​డీఏ) తెలిపింది. ఈ మేరకు దానిపై పరీక్షలు నిర్వహించి, తమ విశ్లేషణను తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఉంచిన ఈ సంస్ధ.. కరోనా నుంచి ఈ వ్యాక్సిన్‌ బలంగా కాపాడుతుందని తెలిపింది.

ఈ వ్యాక్సిన్‌పై నిపుణులతో మరింత లోతుగా చర్చించిన తర్వాత వినియోగం కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ఎఫ్​డీఏ వెల్లడించింది. వినియోగం కోసం అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్‌ను ఆరోగ్య సిబ్బంది, ఇంటివద్ద ఉండి వైద్య చికిత్స పొందతున్న వారికి అందజేస్తామని వెల్లడించింది.

తాము రూపొందించిన టీకా 95శాతం సురక్షితమైనదే అని తేలినట్లు ఫైజర్‌, బయో ఎన్‌ టెక్‌ ప్రకటించగా.. బ్రిటన్‌లో 90 ఏళ్ల వృద్ధురాలికి తొలిసారిగా దాన్ని అందజేశారు.

ఇదీ చూడండి: బ్రిటన్​లో 'వీ'డే- 90ఏళ్ల మ్యాగీకి తొలి టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.