అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు 2020 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ పేరుతో వివిధ రకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ ప్రచారాన్ని, నిధుల సేకరణనూ ఏకకాలంలో చేపట్టారు.
పేపర్ వర్సెస్ ప్లాస్టిక్
లిబరల్ పార్టీ పేపర్ స్ట్రాలకు దీటుగా ట్రంప్ బ్రాండ్ ప్లాస్టిక్ స్ట్రాలు అమ్ముతున్నారు ఆయన మద్దతుదారులు. ట్రంప్ అధికారిక ప్రచార వెబ్సైట్లో పది స్ట్రాలు ఉన్న ప్యాక్‌ను 15 డాలర్లకు విక్రయిస్తున్నారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.
లిబరల్ పార్టీని ఎద్దేవా చేస్తూ... ట్రంప్ ప్రచార నిర్వహకుడు 'లిబరల్ ప్రోగ్రెస్' హ్యాష్‌టాగ్‌తో నలిగిన కాగితపు స్ట్రాను పోస్ట్ చేశారు.
" అమెరికా ఆర్థికవ్యవస్థను కూడా వారు ఇలానే చేస్తారు. అందుకే వారిని(లిబరల్ పార్టీ) అధికారంలోకి రాకుండా చూడాలి" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదీ చూడండి: 'అవినీతిని ప్రోత్సహించేలా ఆర్టీఐకి సవరణలు'