డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా...
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడ్డారు. ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌నకూ కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు డొనాల్డ్.
అంతకుముందు ట్రంప్ ముఖ్య సలహాదారుల్లో ఒకరైన హోప్ హిక్స్‌కు కరోనా సోకగా.. తామూ పరీక్షలు చేయించుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు. కాసేపటికే ఫలితాలు వచ్చాయని, ఇద్దరికీ పాజిటివ్‌గా తేలిందని మరో ట్వీట్ చేశారు. తక్షణమే క్వారంటైన్‌కు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు కరోనా బారినపడటం వల్ల ట్రంప్ ప్రచారానికి బ్రేకులు పడ్డాయి.
క్వారంటైన్‌కు వెళుతున్నట్లు తెలిపిన మెలానియా ట్రంప్... తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే కోలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసిన అమెరికా ప్రథమ మహిళ.. అందరూ సురక్షితంగా ఉండాలని సూచించారు.
త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్...
కరోనా బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.