ETV Bharat / international

ఫైజర్​ టీకాకు అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం

ఫైజర్-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా విస్తృత వినియోగానికి అమెరికా ప్రభుత్వ నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ సిఫారసుకు.. యూఎస్​ఎఫ్​డీఏ ఆమోదం తెలపగానే ప్రజలకు టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బ్రిటన్‌లో టీకా తీసుకున్న ఇద్దరు అలెర్జీకి గురయ్యారనే వార్తల మధ్య.. అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Pfizer COVID-19 vaccine
ఫైజర్​ టీకాకు అమెరికా పచ్చజెండా!
author img

By

Published : Dec 11, 2020, 7:03 AM IST

Updated : Dec 11, 2020, 7:30 AM IST

కొవిడ్‌ వ్యాప్తితో సతమతమవుతున్న అమెరికాలో.. భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ముందడుగు పడింది. ఫైజర్-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా విస్తృత వినియోగానికి అమెరికా ప్రభుత్వ నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. నిపుణుల కమిటీ సిఫారసుకు.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ వ్యవస్థ (యూఎస్​ఎఫ్​డీఏ) ఆమోదం తెలపగానే ప్రజలకు టీకా ఇచ్చేందుకు.. అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

16 ఏళ్లు, ఆపైన ఉన్న యువతకు, పెద్దలకు అత్యవసర వినియోగానికి.. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కొవిడ్ టీకా భద్రమైనది, సమర్థమంతమైనదని 17-4ఓట్ల తేడాతో నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీలో ఒకరు ఓటింగ్‌కు.. గైర్హాజరయ్యారు. బ్రిటన్‌లో టీకా తీసుకున్న ఇద్దరు అలెర్జీకి గురయ్యారనే వార్తల మధ్య.. అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా వ్యాప్తంగా రోజువారీ కొత్త కరోనా కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువగా వస్తుండగా.. మృతుల సంఖ్య రోజుకు మూడు వేలపైనే నమోదవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌కు.. కమిటీ ఆమోదం లభించింది. ఈ టీకాను రెండు డోసులు ఇవ్వాల్సి ఉండగా రెండున్నర కోట్ల డోసులను ఈనెలఖరుకల్లా అందిస్తామని ఫైజర్‌ వెల్లడించింది. ఐతే.. తొలి దశలో టీకాను ఆరోగ్య కార్యకర్తలు, నర్సింగ్‌ హోం వాసులు, వృద్ధులకు రిజర్వు చేశారు. అమెరికాలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 70శాతం మంది ప్రజలకు టీకా ఇవ్వాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది. వచ్చేవారం మోడెర్నా కొవిడ్ టీకాపై ఎఫ్​డీఏ సమీక్ష నిర్వహించనుంది.

ఇదీ చూడండి: టీకా వేయించుకున్నా మాస్క్ తప్పనిసరి!

Last Updated : Dec 11, 2020, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.