కరోనా వైరస్‌కు సంబంధించి రష్యా నిఘా అధికారులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అమెరికా ఆరోపించింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల ముందు అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్ట చేసింది.
రష్యా సైనిక నిఘా సంస్థ 'జీఆర్యూ'కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు ఈ తప్పుడు ప్రచారానికి బాధ్యులుగా గుర్తించినట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తప్పుడు ప్రచారాలకు సంబంధించి అమెరికా ముందే గుర్తించినా.. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు నిశబ్దంగా ఉన్నట్లు తెలిపాయి.
అమెరికా స్థాయిని తగ్గించేలా..
మే- జులై మధ్య మొత్తం మూడు ఇంగ్లీష్ వెబ్సైట్లలో సుమారు 150 కథనాలు ప్రచురితమయ్యాయి. మహమ్మారి స్పందన విషయంలో రష్యాను ఆకాశానికెత్తేస్తూ.. అమెరికా స్థాయిని తగ్గించేలా ఈ కథనాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి.
రాజకీయాలే కాకుండా అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు కరోనా, జాత్యాంహకార నిరసనలే లక్ష్యంగా ఈ కథనాలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాకు రష్యా ఆర్థిక సాయం అందించిందని, కొవిడ్- 19 జీవాయుధమని చైనా భావిస్తోందని ఇందులోని కొన్ని కథనాల సారాంశమని వెల్లడించాయి.
ఇదీ చూడండి: భారతీయులకు సారీ చెప్పిన ఆ దేశ ప్రధాని కుమారుడు