US Nebraska fire accident: అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు.
Two dead Nebraska fire accident
1700 మంది జనాభా నివసించే గ్రామీణ ప్రాంతమైన 'పియెర్స్'లో ఘటన జరిగింది. కట్టెల పొయ్యి ద్వారా ఇంట్లో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ముగ్గురు మృతుల వయసు 12, 15, 17గా ఉందని అధికారులు తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు, స్థానిక పియెర్స్ పబ్లిక్ స్కూల్ మాత్రం.. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. 'విద్యార్థులను పోగొట్టుకున్న నేపథ్యంలో.. సహాయక చర్యల కోసం పాఠశాలను తెరిచే ఉంచుతున్నాం' అని తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది.
ప్రమాదం వార్త తెలుసుకొని అగ్నిమాపక బృందాలు వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఇది ఊహించని విషాదం అని రాష్ట్ర సెనేటర్ మైక్ ఫ్లడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: రష్యాలో జనాభా సంక్షోభం.. దారుణంగా దెబ్బతీసిన కరోనా