అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్ ఆ దేశ నౌకాదళంలో సంక్షోభానికీ వైరస్ కారణమైంది. అమెరికా విమాన వాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్లో కరోనా కలకలానికి బాధ్యత వహిస్తూ నౌకాదళ మంత్రి థామస్ మోడ్లీ రాజీనామా చేశారు.
ఇదీ జరిగింది..
థియోడర్ రూజ్వెల్ట్ నౌకలోని పలువురు నౌకాదళ సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నౌకలో వైరస్ను నియంత్రించలేని కారణంగా కెప్టెన్ బ్రెట్ క్రోజియర్ను ఐదురోజుల కింద బాధ్యతల నుంచి తప్పించారు మోడ్లీ. అయితే ఎలాంటి విచారణ నిర్వహించకుండా క్రోజియర్ను, సిబ్బందిపై వేటు వేయడం వివాదానికి కారణమైంది. దీంతో థామస్ మోడ్లీ రాజీనామా చేశారు.
రాజీనామా లేఖతో పాటు..
రాజీనామా లేఖతో పలు కీలక ఆరోపణలు చేశారు థామస్ . వైరస్ బాధిత నౌకలో పరిస్థితిని రక్షణ విభాగం పెంటగాన్ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
థియోడర్ సిబ్బంది యథాతథం..
నౌకా సిబ్బందిని బాధ్యతల నుంచి తప్పించిన వ్యవహారంలో క్షమాపణలు చెప్పారు మోడ్లీ. అయితే అగ్రరాజ్య ప్రభుత్వ పెద్దలు ఆయన వివరణను పట్టించుకోలేదు. రూజ్వెల్ట్ నౌకలోని సిబ్బంది యథాతథంగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రకటించారు రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్.
ఇదీ చూడండి: మహమ్మారుల జననమెట్టిది.. మానవాళి జయమెట్టిది