ETV Bharat / international

'వాతావరణ సంక్షోభంపై పోరుకు దేశాలన్నీ ఏకం కావాలి' - వాతావరణ సంక్షోభం గురించి జో బైడెన్​

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పిలుపునిచ్చారు. అందుకు తామే నాయకత్వం వహిస్తామని చెప్పారు. అమెరికాలో చమురు, గ్యాస్​ కొత్త లీజులను నిలిపివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

US must lead global response
'వాతావరణ సంక్షోభంపై దేశాలన్నీ కలిసి రావాలి'
author img

By

Published : Jan 28, 2021, 10:10 AM IST

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఈ విషయంలో తామే నాయకత్వం వహిస్తామని చెప్పారు. అమెరికాలో చమురు, గ్యాస్​ల వినియోగానికి సంబంధించిన కొత్త లీజుల కేటాయింపును నిలిపివేస్తూ ఆయన బుధవారం.. కార్యనిర్వహాక ఉత్తర్వులు జారీ చేశారు.

"వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఏకీకృత స్పందన అవసరం. మేము దానికి నేతృత్వం వహిస్తాం. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఏం చేయాలో మాకు తెలుసు. మేము దాన్ని చేస్తాం. "

- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

అమెరికాలో చమురు, గ్యాస్​ నిల్వల తవ్వకంపై తమ ప్రభుత్వం నిషేధం విధించట్లేదని బైడెన్​ తెలిపారు. కానీ, మీథేన్​ లీక్​ విషయంలో పటిష్ఠ భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదివరకు ఉన్న​ లీజుల విషయంలో తాము సమీక్ష నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. చమురు కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్​ను బైడెన్​ కోరారు.

బైడెన్​ తాజా ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ.. అమెరికా ప్రభుత్వంపై వెస్టర్న్​ ఎనర్జీ అలియెన్స్​.. ఓ దావాను దాఖలు చేసింది. మినరల్​ లీజింగ్​ చట్టం, జాతీయ పర్యావరణ విధాన చట్టం, ఫెడరల్​ ల్యాండ్స్​ పాలసీకి వ్యతిరేకంగా బైడెన్​ ఉత్తర్వులు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చదవండి:హెచ్1బీ వీసాదారులకు బైడెన్ ఊరట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.