అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట ప్రపంచ మానవ హక్కుల సంఘం నుంచి అగ్రదేశం ఇప్పటికే వైదొలిగింది. బైడెన్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం తిరిగి యూఎన్ మానవ హక్కుల సంఘంతో ఒప్పందం చేసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్‌కు సంబంధించిన విషయంపై మానవహక్కలు సంఘం ప్రవర్తించిన తీరుకు నిరసనగా అమెరికా బయటకు వచ్చింది.
బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై చట్టసభ సభ్యులు నుంచే కాకుండా, ఇజ్రాయేల్‌లో చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జెనీవాలోని మరో సీనియర్ అమెరికా దౌత్యవేత్త కలసి ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అమెరికా శాశ్వత సభ్యదేశంగా కొనసాగే దిశగా ఎన్నికను కోరనుంది అమెరికా.
2018లో ఐక్యరాజ్యసమితిలో మార్పులు కోరుతూ అప్పటి అమెరికా రాయబారి నిక్కిహేలీ పలు సంస్కరణలు ప్రతిపాదించారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో సమితి విఫలం అయ్యింది. ఈ క్రమంలో సభ్యదేశంగా అందులోనుంచి వైదొలుగుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బైడెన్ బృంద సభ్యులు స్పందించారు. 'మార్పు తీసుకురావాలి అంటే ముందు కలిసి పనిచేయాలి' సుత్రాన్ని బైడెన్ నమ్ముతారని తెలిపారు.
ఇదీ చూడండి: ఇరాన్‌పై ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదు: బైడెన్