దిగ్గజ వాహనాల తయారీ సంస్థ ఫోర్డ్ తమ ఉద్యోగులను భారీగా తగ్గించుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 7,000 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే వేతనాల భారం 10 శాతం తగ్గుతుందని ఫోర్డ్ పేర్కొంది. ఈ నిధులను విద్యుత్, స్వయంచోదక (డ్రైవర్ అవసరం లేని) వాహనాల తయారీకి వినియోగించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
అమెరికాలో అధికం
అమెరికాలో మొత్తం 2,300 ఉద్యోగాలు తొలగించాలని ఫోర్డ్ నిర్ణయించింది. అందులో 1,500 మంది స్వచ్ఛందంగా తప్పుకోనున్నారని కంపెనీ తెలిపింది. 300 మంది ఉద్యోగులు ఇప్పటికే సంస్థను వీడగా.. 500 మంది ఈ వారంలో ఉద్యోగాన్ని వదిలేయనున్నట్లు పేర్కొంది.
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ గత ఏడాది జూలై నుంచే ప్రారంభమైంది. అప్పటి నుంచే ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన భయం పట్టుకుంది.
"ఆటోమొబైల్ పరిశ్రమలో ఇదో రకమైన పునర్వ్యవస్థీకరణ మార్గం. సాధారణంగా చివరి నిమిషం వరకు వేచి చూస్తారు లేదా సమస్య పరిష్కారమయ్యే వరకు చూస్తారు. అ తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు." -టామ్ క్రిషర్, పాత్రికేయుడు
ఇదీ చూడండి: గేమ్ ఆఫ్ థ్రోన్స్, బీబర్తో ప్రకృతికి ముప్పు
!