కయ్యాల చైనా కనుసన్నల్లో నడిచే 20 సంస్థల జాబితాను అగ్రరాజ్యం అమెరికా విడుదల చేసింది. హువావే టెక్నాలజీస్‌తో సహా ఆయా సంస్థలన్నీ చైనా ప్రభుత్వం, మిలిటరీ లేదా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని శ్వేతసౌధం హెచ్చరించింది. ఇవి అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలని... వీటి కర్త, కర్మ, క్రియ అన్నీ చైనా ప్రభుత్వమో లేదా మిలిటరీ అని శ్వేతసౌధం అధికార ప్రతినిధి జొనాథన్ హాఫమన్ ఆరోపించారు. ఈ జాబితాలోని ఇతరసంస్థల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఇన్‌స్పర్ గ్రూప్
- ఏవియేషన్ ఇండస్ట్రీ ఆఫ్ చైనా
- చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్
- చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్
- చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్
- చైనా సౌత్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్
- చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్
- చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్
- చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్
- హాంగ్జౌ హైవిజన్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీ
- ఏరో ఇంజిన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా
- చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్
- సీఆర్‌ఆర్‌సీ కార్పోరేషన్
- పాండా ఎలక్ట్రానిక్స్ గ్రూప్
- డానింగ్ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ కంపెనీ
- చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్
- చైనా జనరల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్
- చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్
- చైనా టెలీకమ్యూనికేషన్స్ కార్పొరేషన్
ఇటువంటి సంస్థలు అమెరికా పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోకుండా ట్రంప్ ప్రభుత్వం కృషిచేస్తోందని... హాఫ్‌మన్ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా ప్రభుత్వం, సంస్థలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, భాగస్వాములు ఈ సంస్థలతో లావాదేవీలు నిర్వహించే విషయంలో 'తగిన శ్రద్ధ' వహించేందుకు వీలుగా ఈ జాబితాను విడుదల చేశామని ఆయన వివరించారు. కమ్యూనిస్టు చైనా.. పౌర, సైనిక వ్యవస్థల మధ్య రేఖలను చెరిపేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఈ జాబితా ఇంకా పెరగనుందని కూడా హాఫ్‌మన్ అన్నారు. కాగా, సరిహద్దు వివాదాలకు కాలుదువ్వుతున్న చైనా పట్ల భారత్ కూడా వాణిజ్య పరంగా కఠిన వైఖరి అవలంబించాలని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ఇదీ చూడండి: టాయిలెట్ డిజైన్ చెప్పండి.. రూ.15 లక్షలు గెలుచుకోండి!