ETV Bharat / international

'భారత్​కు సరిపడా వ్యాక్సిన్లు అందించండి' - భారత్​కు అమెరికా టీకాలు

బైడెన్​ యంత్రాంగం భారత్​కు సరిపడా వ్యాక్సిన్లు, వైద్య సహాయం అందించాలని అమెరికా చట్టసభ్యులు, గవర్నర్​లు సూచించారు. భారత్​ను ఆదుకోవడం అమెరికా బాధ్యత అని అన్నారు.

us lawmakers on vaccines to india, భారత్​కు అమెరికా టీకాలు
భారత్​కు టీకాపై అమెరికా నేతలు
author img

By

Published : Jun 7, 2021, 10:39 AM IST

కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న భారత్​కు వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా చట్టసభ్యులు, గవర్నర్​లు జో బైడెన్​ యంత్రాంగానికి సూచించారు. ప్రస్తుతం భారత్​లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఈ సమయంలో ఆ దేశానికి సాయం అందించడం అమెరికా బాధ్యత అని పేర్కొన్నారు. విదేశాలకు అమెరికా వ్యాక్సిన్లను అందించేందుకు సిద్ధమైన నేపథ్యంలో చట్టసభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్​లు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రిపబ్లికన్ నేత​ విమర్శ..

"అధ్యక్షుడు బైడెన్ చేపడుతున్న వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమం లోపాలతో నిండి ఉంది. ​అమెరికాకు భారత్​ ఎంతో సన్నిహిత దేశం. అటువంటి దేశాలకే ప్రధానంగా టీకా సాయం అందించాలి. వారికి సరిపడా వ్యాక్సిన్లు సమకూర్చాలి."​

-టెడ్​ క్రూజ్​, రిపబ్లికన్​ చట్టసభ్యుడు

భారతీయ అమెరికన్ విజ్ఞప్తి..

వ్యాక్సిన్​ కొరతలో ఉన్న భారత్​ను ఆదుకోవాలని భారతీయ అమెరికన్​ చట్టసభ్యుడు ఆర్​ఓ ఖన్నా..​ బైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమెరికా ఉపయోగించని టీకాలను భారత్​కు తరలించాలని పేర్కొన్నారు.

భారత్​కు సరిపడా వ్యాక్సిన్లతో పాటు అవసరమైన వైద్య సహాయం కూడా అందించాలని చట్టసభ్యులు, గవర్నర్​లు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : అక్కడ మాస్క్‌ ధరిస్తే జరిమానా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.