ETV Bharat / international

US Job Openings: ఒక్కనెలలో 4,67,000 మందికి ఉద్యోగాలు - అమెరికాలో ఉద్యోగాలు

US Job Openings: అమెరికాలో జనవరిలో 4.67 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రభావం ఉన్నప్పటికీ.. అంచనాలకు మించి నియామకాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

US Job Openings
US Job Openings
author img

By

Published : Feb 5, 2022, 5:30 AM IST

US Job Openings: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్‌ ప్రభావం ఉన్నప్పటికీ.. జనవరిలో అమెరికాలో 4,67,000 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఆ దేశ కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబరుతో పోలిస్తే నిరుద్యోగ రేటు 3.9 నుంచి 4 శాతానికి పెరిగింది.

ఊహించినదానికి మించి నియామకాలు జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నియామకాలపై వాణిజ్య సంస్థల యాజమాన్యాల్లో ఉన్న ఆత్రుతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్‌ ప్రభావం తాత్కాలికమే అనే భావనతో సంస్థలు ఉన్నాయని, దీర్ఘకాల వృద్ధిపై ఆశావహ దృక్పథంతోనే నియామకాలు చేపట్టినట్టుగా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: Plane Crash: కుప్పకూలిన విమానం- ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.