ETV Bharat / international

'ఇరాన్​తో ముప్పు.. అందుకే బలగాల మోహరింపు' - మోహరింపు

మధ్యప్రాచ్యంలో మరిన్ని బలగాలను మోహరించేందుకు అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్​తో ముప్పు పొంచి ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది అగ్రరాజ్యం. అమెరికా చర్యలు ప్రపంచ శాంతికి విఘాతమని ఇరాన్​ ఆరోపించింది.

'ఇరాన్​తో ముప్పు... అందుకే బలగాల మోహరింపు'
author img

By

Published : May 26, 2019, 6:29 AM IST

Updated : May 26, 2019, 8:38 AM IST

'ఇరాన్​తో ముప్పు... అందుకే బలగాల మోహరింపు'

ఇరాన్​తో ముప్పు పొంచి ఉందని ఆరోపిస్తూ మధ్యప్రాచ్యం(మిడిల్​ ఈస్ట్​)లో అదనపు బలగాలను మోహరించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. సర్వసన్నద్ధులైన 1500మంది రక్షణ సిబ్బందిని మధ్య ప్రాచ్యానికి పంపేందుకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా చర్యలను ఇరాన్​ ప్రభుత్వం తప్పుబట్టింది.

"మధ్యప్రాచ్యంలో అమెరికా ఉనికి పెరగడం అంతర్జాతీయ శాంతికి విఘాతం. గల్ఫ్ దేశాల్లో భద్రత మరింత దిగజారే అవకాశం ఉంది"

-మహ్మద్ జావెద్, ఇరాన్ విదేశాంగ మంత్రి

తమ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అనుమానాలతోనే తాజా నిర్ణయం తీసుకుంది అమెరికా. ఇప్పటికే అబ్రహం లింకన్​ యుద్ధ నౌక, బీ-52 శ్రేణి బాంబర్లను ఇరాన్​ లక్ష్యంగా పంపింది. ఇరాన్ బద్ధ శత్రువైన సౌదీ అరేబియాకు కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఆయుధాలు విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
కొంత కాలంగా ఇరాన్​, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2015 అణుఒప్పందం నుంచి అమెరికా స్వచ్ఛందంగా వైదొలగిన అనంతరం ఈ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్​పై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇరాన్​ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

మధ్యవర్తిత్వానికి ఇరాక్ సిద్ధం

ఇరాన్ కోరితే అమెరికాతో సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాక్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ హల్​బౌసీ ప్రకటించారు. బాగ్దాద్​లో ఇరాన్ ఆర్థిక మంత్రి మహ్మద్ జావేద్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బౌసీ.

ఇదీ చూడండి: రయ్​రయ్​: సూపర్ కార్లన్నీ ఒకేచోటకు వస్తే...

New Delhi, May 25 (ANI): The newly elected Member of Parliaments (MPs) of the Bharatiya Janata Party and other party leaders arrived in the national capital today. They have arrived for the National Democratic Alliance (NDA) Parliamentary Board meeting in Delhi. While speaking to media, Bharatiya Janata Party (BJP) leader and elected MP from Mathura Hema Malini said, "Prime Minister Narendra Modi has worked very hard and he has impressed the entire country. As I have also won, I am happy that I delivered some good work in my constituency, that is why I got here." Meanwhile, BJP MP from Delhi North West Lok Sabha seat Hans Raj Hans said, "I would like to thank almighty and my parents for my victory. Prime Minister Narendra Modi is an international star and I also want to thank him and Bharatiya Janata Party president Amit Shah for this. I will fulfill all my responsibilities here."
Last Updated : May 26, 2019, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.