అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి ముగుస్తుండగా ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అక్కడున్న పోలీసులు ముష్కరుడిని హతమార్చారు. రెండు చేతుల్లో తుపాకులు ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపాడని.. దాదాపు 20 సార్లు దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
సంగీత విభావరికి భద్రత కల్పించిన దళాలు వెంటనే స్పందించడం వల్ల ప్రాణ నష్టం భారీగా తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇదీ చదవండి : బస్సు బోల్తా-20 మంది పరిస్థితి విషమం!