ETV Bharat / international

45 మంది యువకులపై నేడు కరోనా వ్యాక్సిన్​ ప్రయోగం

కరోనా వ్యాక్సిన్​ తయారీపై చర్యలు వేగవంతం చేసింది అగ్రరాజ్యం. ఇప్పటికే తయారుచేసిన ఓ వ్యాక్సిన్​ను 45మంది యువకులపై ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి ​అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిధులు సమకూర్చుతోంది.

US govt official: Coronavirus vaccine trial starts Monday
45 మంది యువకులపై కరోనా వ్యాక్సిన్​ తొలిప్రయోగం
author img

By

Published : Mar 16, 2020, 8:33 AM IST

కరోనా వైరస్​ను తరిమికొట్టే వ్యాక్సిన్​ తయారు చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికో ఓ ముందడుగేసి.. వ్యాక్సిన్​ను రూపొందించింది. అయితే ఈ వ్యాక్సిన్​ను నేడు తొలిసారిగా మానవశరీరంపై ప్రయోగించనుంది. ​

వ్యాక్సిన్​ను 45 యువ వాలంటరీలపై వేరువేరు డోసులలో ప్రయోగించనున్నారు. వారి శరీరంలో వైరస్​ లేనందున ఈ ప్రయోగంలో పాల్గొన్న వారి ఆరోగ్యాలపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

సీటెల్​లోని కైసర్​ పర్మనెంటె వాషింగ్​టన్​ ఆరోగ్య పరిశోధనా సంస్థ వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్రయోగానికి అమెరికా జాతీయా ఆరోగ్య సంస్థ నిధులు సమకూర్చుతోంది. అయితే, ఏ వ్యాక్సిన్​ అయినా చలామణిలోకి రావాలంటే కనీసం ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: స్వయంకృషికి చిరునామా.. ఈ వందేళ్ల బామ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.