ETV Bharat / international

ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం - ఫైజర్​ టీకా

కొవిడ్​ వ్యాక్సిన్​ ఫైజర్​ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది అమెరికా ఎఫ్​డీఏ. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు వ్యాక్సిన్​ ఫలితాలను పరిశీలించి ఆమోదం తెలిపింది. ఫైజర్​ వినియోగానికి మెక్సికో కూడా ఆమోదం తెలిపింది.

pfizer
ఫైజర్​ టీకా వినియోగానికి అమెరికా ఎఫ్​డీఏ ఆమోదం
author img

By

Published : Dec 12, 2020, 8:38 AM IST

Updated : Dec 12, 2020, 9:02 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు 'ఫైజర్'​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి ఇప్పటికే బ్రిటన్​, బహ్రెయిన్​ వంటి దేశాలు అనుమతించగా.. ఆ జాబితాలో అమెరికా చేరింది. ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది అగ్రరాజ్య ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ). అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన మరుసటి రోజే ఆమోదం లభించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో త్వరలోనే ఆరోగ్య సిబ్బంది, తీవ్రంగా ప్రభావితమైన వారికి టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ టీకాను అమెరికన్​ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్​, జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తమ టీకా 90 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తోందని ఇప్పటికే ప్రకటించింది ఫైజర్​ సంస్థ.

మరో 100 మిలియన్ల మోడెర్నా డోసులు

తమ నుంచి అదనంగా మరో 100 మిలియన్​ డోసులను అమెరికా కొనుగోలు చేయనుందని ప్రకటించింది మోడెర్నా సంస్థ. ఫలితంగా మొత్తం 200 మిలియన్​ డోస్​ల లక్ష్యం పూర్తవుతుందని తెలిపింది. తొలి 100 మిలియన్​ డోసుల్లో 20 మిలియన్లు ఈనెల చివరినాటికి అందిస్తామని, మిగతావి 2021 తొలినాళ్లలో అందజేస్తామని స్పష్టం చేసింది. అలాగే తాజాగా అందిన 100 మిలియన్​ డోస్​ల ఆర్డర్​ను 2021 రెండో అర్ధభాగంలో డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. 2021 జూన్​ నాటికి అదనపు డోసులు అందుతాయని అమెరికా ఆరోగ్య, మానవ వనరుల శాఖ మంత్రి అలెక్స్​ అజర్​ పేర్కొన్నారు.

ఫైజర్​కు మెక్సికోలోనూ ఓకే..

ఫైజర్​-బయఎన్​టెక్​ అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి మెక్సికో ఔషధ భద్రతా కమిషన్​ ఆమోదం తెలిపింది. ఫైజర్​ టీకా వినియోగానికి అనుమతించిన ఐదో దేశంగా నిలిచింది మెక్సికో. ఇప్పటికే.. బ్రిటన్​, కెనడా, బహ్రెయిన్​, అమెరికా దేశాలు అనుమతించగా.. తాజాగా మెక్సికో కూడా ఆ జాబితాలో చేరింది. ఈ క్రమంలో 250,000 డోసుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వచ్చే వారంలో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, తొలుత ఆరోగ్య సిబ్బందికి అందిస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్​కు ఎదురుదెబ్బ

Last Updated : Dec 12, 2020, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.