ETV Bharat / international

పూర్తిస్థాయి అనుమతులు పొందిన తొలి టీకా ఇదే.. - ఫైజర్ టీకా అమెరికా అనుమతులు

pfizer full approval
ఫైజర్ టీకాకు అమెరికా పూర్తి స్థాయి అనుమతులు
author img

By

Published : Aug 23, 2021, 7:32 PM IST

Updated : Aug 23, 2021, 8:19 PM IST

19:30 August 23

పూర్తిస్థాయి అనుమతులు పొందిన తొలి టీకా ఇదే..

కరోనా నివారణకు ఫైజర్- బయోఎన్​టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన టీకాకు అమెరికాలో పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. ఇప్పటివరకు అత్యవసర వినియోగార్థం ఈ టీకాను పంపిణీ చేస్తుండగా.. తాజాగా పూర్తిస్థాయి అనుమతులు ఇస్తూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్​డీఏ ప్రకటన జారీ చేసింది. టీకాపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా టీకాకు పూర్తిస్థాయి అనుమతులు లభించడం వ్యాక్సినేషన్​లో ఓ మైలురాయి అని ఎఫ్​డీఏ కమిషనర్ జానెట్ వుడ్​కాక్ పేర్కొన్నారు. ఇప్పటికే లక్షలాది మంది టీకా తీసుకున్నారని.. వ్యాక్సిన్ తీసుకోనివారికి ఈ నిర్ణయంతో టీకాపై విశ్వాసం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో.. పూర్తిస్థాయి అనుమతులు లభించిన తొలి టీకా ఇదే కావడం విశేషం. ఇక నుంచి ఈ టీకాను దాని బ్రాండ్ ​నేమ్ అయిన కమిర్నటి పేరుతో విక్రయించే వీలుంటుంది. 16 ఏళ్ల పైబడిన వారికి పూర్తిస్థాయి అనుమతులతో టీకా అందుబాటులో ఉండనుంది. అత్యవసర వినియోగ అనుమతులతో 12-15 ఏళ్ల వయసు వారికి టీకా ఇవ్వనున్నారు. ఎఫ్​డీఏ తాజా నిర్ణయం వల్ల.. 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్​ను సిఫార్సు చేసే అధికారం వైద్యులకు లభించింది. 

ఈ ప్రకటనతో వ్యాపార సంస్థలు, విద్యాలయాలు టీకా తప్పనిసరి నిబంధనను కఠినంగా అమలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 

Last Updated : Aug 23, 2021, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.