ETV Bharat / international

'కరోనా వల్ల ఇప్పుడు భారత్​కే అసలు సమస్య' - trump news

కరోనాపై పోరులో అమెరికా కీలక పురోగతి సాధిస్తోందని చెప్పారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రపంచ దేశాలతో పోల్చితే తమ దేశంలోనే పరిస్థితులు మెరుగుపడుతున్నట్టు పేర్కొన్నారు. వైరస్​ కారణంగా భారత్​ అసలు సమస్యను మున్ముందు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు ట్రంప్​. అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నట్లు గుర్తు చేశారు. అలాగే చైనాలోనూ మారోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు.

US doing 'very well' against COVID-19, India has a 'tremendous problem': Trump
'కరోనా వల్ల ఇప్పుడు భారత్​కే అసలు సమస్య'
author img

By

Published : Aug 4, 2020, 3:42 PM IST

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. గత వారంతో పోల్చితే బాధితుల సంఖ్య 6శాతం మేర తగ్గినట్లు వెల్లడించారు. పాజిటివ్​ రేటు కూడా 8.7 శాతం నుంచి 8 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. మహమ్మారిపై పోరులో పురోగతి సాధించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చితే అమెరికాలోనే పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు ట్రంప్.

" ప్రపంచంలోని ఉన్నత దేశాల్లో కరోనా కట్టడిలో అమెరికానే మెరుగైన స్థానంలో ఉంది. 18 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు 6కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. మరే ఇతర దేశం ఈ దారిదాపుల్లో కూడా లేదు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న భారత్​ ఇప్పుడు అసలు సమస్యను ఎదుర్కోనుంది. చైనాలో కూడా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది."

-డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

47లక్షలకు పైగా కేసులు, లక్షా 55వేలకుపైగా మరణాలతో కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా. అయితే ఇప్పుడు భారత్​లో ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. అటు చైనాలో మూడు నెలల తర్వాత వారం రోజుల్లోనే 100కుపైగా కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చూడండి: అమెరికాలో 'రామాలయం భూమిపూజ' వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.