ETV Bharat / international

Farm laws repeal: సాగు చట్టాల రద్దును స్వాగతించిన అమెరికా!

నూతన సాగు చట్టాలను రద్దు (farm laws repealed news) చేస్తామని కేంద్రం ప్రకటించటాన్ని స్వాగతించారు అమెరికా కాంగ్రెస్​ సభ్యుడు. కార్మికులు కలిసికట్టుగా పోరాడితే దేనినైనా ఓడించగలరనేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

US Congressman welcomes repeal of farm laws
సాగు చట్టాల రద్దును స్వాగతించిన అమెరికా
author img

By

Published : Nov 20, 2021, 9:40 AM IST

భారత్​లో గత ఏడాది తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repealed news) చేయటాన్ని స్వాగతించారు అమెరికా కాంగ్రెస్​ సభ్యుడు ఆండీ లెవిన్​. కార్మికులు కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తారనేదానికి ఇది సాక్ష్యమని పేర్కొన్నారు.

  • Glad to see that after more than a year of protests, the three farm bills in India will be repealed. This is proof that when workers stick together, they can defeat corporate interests and achieve progress - in India and around the world.https://t.co/upgnTe2sbn

    — Rep. Andy Levin (@RepAndyLevin) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఏడాదికిపైగా ఆందోళనల తర్వాత భారత్​లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయటం చాలా సంతోషకరం. కార్మికులు కలిసికట్టుగా ఉంటే, కార్పొరేట్​ ప్రయోజనాలను దెబ్బతీయగలరని, భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా పురోగతి సాధించవచ్చనేందుకు ఇదే నిదర్శనం."

- ఆండీ లెవిన్​, అమెరికా కాంగ్రెస్​ సభ్యుడు.

రైతుల విజయం..

వ్యవసాయంలో సంస్కరణల పేరుతో మూడు నూతన వ్యవసాయ చట్టాలను(farm laws repealed india) గత ఏడాది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, వాటితో రైతులకు ముప్పు వాటిళ్లుతుందని, కనీస మద్దతు ధర లభించక.. కార్పొరేట్​ పరిశ్రమల చేతిలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యతిరేకత మొదలైంది. సాగు చట్టాలను(Farm laws news) రద్దు చేయాలని కోరుతూ ఆందోళనలు(Farmers protest) చేపట్టారు రైతులు. వందల సంఖ్యలో దిల్లీ సరిహద్దులకు చేరుకుని పోరాటం కొనసాగించారు. ఈ క్రమంలో సుమారు 7 వందల మంది రైతులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రైతుల అలుపెరగని పోరాటంతో(Farmers protest news) కేంద్రం దిగొచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే(PM Modi).. సాగు చట్టాలను రద్దు చేస్తామని శుక్రవారం ప్రకటించారు.

ప్రధాని ప్రకటనతో సంతోషం వ్యక్తం చేసిన కర్షకులు, దిల్లీ సరిహద్దులతో పాటు దేశవ్యాప్తంగా మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. అయితే.. రాజ్యాంగబద్ధంగా చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాల్లో ఏముందంటే..

కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగానికి(Farm laws repeal) సంబంధించి గతేడాది తొలుత మూడు ఆర్డినెన్సులను, తర్వాత వాటి స్థానంలో బిల్లులను తెచ్చింది. అవి పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలయ్యాయి. అవేంటంటే..

  • రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020: రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్​ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్​ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్​ను గానీ పన్నులనూ వసూలు చేయరు.
  • రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020: రైతులు నేరుగా అగ్రికల్చర్​ బిజినెస్​ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
  • నిత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020: తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు వంటి ఉత్పత్తులను నిత్యవసర వస్తువుల జాబితా నుంచి తొలగించాలని ఈ సవరించిన ఈ చట్టం చెబుతుంది. యుద్ధం, కరువు లాంటి పరిస్థితుల్లో ఈ వస్తువులపై పరిమితులు ఎత్తివేయాలని నిర్దేశిస్తుంది.

ఇదీ చూడండి: Farm Laws repealed: రైతులోకం సాధించిన చారిత్రక విజయం

Bijoliya Kisan Andolan: ఆ రైతులది 45 ఏళ్ల పోరాటం!

Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.