ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకే ఆయా దేశాలకు చైనా, రష్యాలు కరోనా వ్యాక్సిన్లు అందిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాఖి. చైనా, రష్యా దేశాల్లో మానవహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, మతస్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలకు విఘాతాలపై ప్రశ్నించకుండా ఉండేందుకే ఇరు దేశాలు ఈ చర్యలకు పాల్పడుతున్నాయన్నారు.
టీకాల పంపిణీ విషయంలో చైనా, రష్యా దూసుకెళ్తుంటే.. అమెరికా మాత్రం చివర్లో ఉందన్న మీడియా ప్రశ్నకు సాఖి వివరణ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి మొత్తం అమెరికా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించటంపైనే ఉందన్నారు సాఖి. తమ ప్రాథమిక కర్తవ్యం అదే అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'మే చివరినాటికి వయోజనులందరికీ కరోనా టీకా'