ETV Bharat / international

యూఎస్​-చైనా వార్.. యాపిల్ ఐఫోన్​ బేజార్​..! - పన్నులు

ధరలు పెరగనున్నాయి. అమెరికా-చైనా పరస్పరం సుంకాలు పెంచుకోవడం... ఫలితంగా యాపిల్ ఫోన్ల ఉత్పత్తి వ్యయం పెరగనుండడమే ఇందుకు కారణం.

యూఎస్​-చైనా వార్.. ఐఫోన్​ బేజార్​..!
author img

By

Published : May 16, 2019, 6:00 AM IST

Updated : May 16, 2019, 9:22 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన దృష్ట్యా, యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి వ్యయం సుమారు 3 శాతం పెరుగనుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై చైనా తాజాగా సుంకాలు విధిచడమే ఇందుకు కారణం.

"చైనాలో తయారయ్యే బ్యాటరీలు, ఇతర విడిభాగాలపై పన్నులు పెరిగిన కారణంగా ఐఫోన్​ ఉత్పత్తి వ్యయం 2 నుంచి 3 శాతానికి పెరుగుతుంది." -డాన్​ ఇవీస్​, వెడ్​బుష్​ విశ్లేషకుడు, ఫార్చూన్​ కోట్​

యాపిల్.... ఇంతకు ముందు ప్రతి సెల్​ఫోన్​ విక్రయం ద్వారా ఎంత మొత్తం లాభాలు ఆర్జించిందో, ఇప్పుడూ అంతే మొత్తం లాభాలను సాధించాలంటే, కచ్చితంగా ఐఫోన్​ ధరలను పెంచాల్సిందే. ఉదాహరణకు 'ఐఫోన్​ 10ఎస్​' ధర 999 డాలర్లు నుంచి 1,029 డాలర్లకు పెంచాల్సి ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇప్పటికే 200 బిలియన్​ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్నులు పెంచారు. మరో 325 బిలియన్​ డాలర్ల విలువైన ఉత్పత్తులపైనా సుంకాలు విధించాలని అధికారులను ఆజ్ఞాపించారు. ఇదే అమలులోకి వస్తే, ఐఫోన్ ఉత్పత్తి ధరలు అమాంతం పెరిగి, ఒక్కో ఫోన్​ తయారీకి సుమారు 120 డాలర్లు అవుతుందని, వెడ్​బుష్​ విశ్లేషకుడు ఇవీస్​ చెబుతున్నారు.

ఇదీ విషయం..

అమెరికా-చైనా వాణిజ్యయుద్ధం తీవ్రరూపం దాల్చింది. ముందుగా ట్రంప్​ ప్రభుత్వం సుమారు 200 బిలియన్​ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచుతూ మే 10న నిర్ణయం తీసుకుంది.

ధీటుగా స్పందించిన చైనా, ప్రతీకార చర్యగా అమెరికా దిగుమతులపై 60 బిలియన్​ డాలర్ల మేర పన్నులు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అమెరికా తయారీ బ్యాటరీలు, కాఫీ, ఇతర ఉత్పత్తులపై విధించిన సుంకాలు జూన్​ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

ఇదీ చూడండి: తిరిగొచ్చేయండి:దౌత్యాధికారులకు అమెరికా ఆదేశం

Intro:Body:

asas

Conclusion:
Last Updated : May 16, 2019, 9:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.