చెర్రీ పూల సోయగంతో అమెరికాలో వసంతం వెల్లివిరిసింది. లేత గులాబీ, శ్వేత వర్ణాలతో అలరించే ఈ చెర్రీ పుష్పాలను వీక్షించడానికి ప్రకృతి ప్రేమికులు ఉత్సాహం చూపిస్తున్నారు.
వాషింగ్టన్ జాతీయ ఉద్యానవనం వద్ద సుమారు 12 రకాల యోషినో వృక్షాలు ఉన్నాయి. ఏప్రిల్ మొదటివారంలోనే 70 శాతం చెర్రీ మొగ్గలు వికసిస్తాయి. వీటిని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రకృతి అందాలకు మరింత శోభనిచ్చే ఈ పుష్పాలను చూసి ఆనందిస్తున్నారు.
ప్రకృతి రమణీయతకు దర్పణమైన ఈ పుష్పజాతులను జపాన్ 1912లో వాషింగ్టన్కు బహూకరించింది.
ఇదీ చూడండి :'భారత్‌పై నిఘా కాదు- వ్యర్థాల పరిశీలనే'