ETV Bharat / international

అమెరికాలో ఇక మాస్క్​ లేకుండా తిరగొచ్చు! - latest mask guidelines

కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. కొవిడ్​-19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

CDC
సీడీసీ
author img

By

Published : May 14, 2021, 6:28 AM IST

Updated : May 14, 2021, 8:15 AM IST

మాస్కులు ధరించడంపై అమెరికన్లకు ఆ దేశ వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్‌-19 రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనాతో నాడు అత్యంత దారుణంగా ప్రభావితమైన అమెరికా.. సాధారణ పరిస్థితులవైపు శరవేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇదే నిదర్శనం.

నూతన మార్గదర్శకాలు ఇలా..

  • ఫైజర్​, మోడెర్నా, జాన్సన్​ అండ్​ జాన్స్​, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
  • వ్యాక్సిన్​ తీసుకోకపోయినా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందక పోయినా మాస్కు ధరించాల్సిందే.
  • టీకా రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత మాస్కులు తీసేయవచ్చు.
  • రాష్ట్రాలు నిబంధనలు విధిస్తే వాటిని పాటించాలి. నిబంధనలు లేకపోతే భౌతిక దూరం కూడా అవసరం లేదు.
  • ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కొవిడ్​ పరీక్షలు చేయించుకోనవసరం లేదు.
  • ప్రయాణం తర్వాత క్వారంటైన్​, హోంక్వారంటైన్​ అవ్వాల్సిన అవసరం లేదు.

బైడెన్ హర్షం..

సీడీసీ ప్రకటనపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికన్లకు వ్యాక్సిన్లను శరవేగంగా అందిస్తుండటం వల్లే ఈ మైలురాయి సాధ్యమైందనని పేర్కొన్నారు. 114 రోజుల్లో 25కోట్ల వ్యాక్సిన్​ డోసులు అందించామని వెల్లడించారు.

"ఇదొక గొప్ప రోజు. ఇదొక గొప్ప మైలురాయి. టీకా తీసుకున్న ప్రజలు మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదు. 49 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఏప్రిల్​ నాటితో పోలిస్తే మరణాల శాతం 80శాతం తగ్గింది. నాలుగు నెలల వ్యవధిలో పెద్దలకు వ్యాక్సిన్లు అందించడంలో 5.5శాతం నుంచి 60 శాతానికి చేరుకున్నాము. ఆర్థిక వ్యవస్థ కూడా గత 40ఏళ్లలో లేని విధంగా పుంజుకుంటోంది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి:- అమెరికాలో తగ్గిన నిరుద్యోగుల సంఖ్య!

Last Updated : May 14, 2021, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.