ETV Bharat / international

రూ. 460కోట్ల ఉగ్రవాద నిధులకు అమెరికా అడ్డుకట్ట

2019లో రూ. 430కోట్ల నిధులను ఉగ్రవాద సంస్థలకు చేరకుండా అడ్డుకట్ట వేసినట్టు అమెరికా ఆర్థికశాఖ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా రూ. 28.5 కోట్లు లష్కరే తొయిబాకు చెందినవిగా పేర్కొంది.

US blocks $63 million in funds of global terrorist groups in 2019: Report
రూ. 460కోట్ల ఉగ్రవాద నిధులకు అమెరికా అడ్డుకట్ట
author img

By

Published : Jan 2, 2021, 5:36 AM IST

దాదాపు 70 ఉగ్రవాద సంస్థలకు చెందిన 6.3కోట్ల డాలర్ల(రూ. 460కోట్లు) నిధులకు 2019లో అమెరికా అడ్డుకట్ట వేసింది. అత్యధికంగా అల్​ఖైదా సంస్థ నిధులను 39లక్షల డాలర్లు(రూ. 28.5కోట్లు) అడ్డుకుంది. పాకిస్థాన్​కి చెందిన ఉగ్రవాద సంస్థలు.. లష్కరే తొయిబావి 3.4లక్షల డాలర్లు(రూ. 2.4కోట్లు), జైషే మహమ్మద్​ 1,725డాలర్లు(రూ. 1.2లక్షలు), హర్కత్​-అల్​-ముజాహిదీన్​-అల్​ ఇస్లామి 45,798డాలర్లు(రూ. 33లక్షలు) నిధులు వీటిలో ఉన్నాయి. అమెరికా ఆర్థికశాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

విదేశీ ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో భాగంగా గుర్తింపు పొందిన ఉగ్రవాద సంస్థల నిధులను నిరోధించినట్లు నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. తాలిబన్ల నిధులు 59,065డాలర్లు(రూ. 43లక్షలు), పాక్​ ఆక్రమిత కశ్మీర్​ కేంద్రంగా ఉన్న హిజ్బుల్​ ముజాహిదిన్​కి చెందిన 4,321డాలర్లు(రూ. 3.15లక్షలు), తెహ్రిక్​-ఎ-తాలిబన్​ పాకిస్థాన్​వి 5,067డాలర్ల(రూ. 3.7లక్షలు) నిధులకు అడ్డుకట్ట వేసింది.

ఇదీ చూడండి:- స్నేహితుడికి 'ఎస్' చెప్పింది.. ఆ తర్వాత?‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.