అగ్రరాజ్యం అమెరికా చైనాకు మరో షాకిచ్చింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సహా 9 చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇందులో చైనా ప్రభుత్వాధీనంలో పని చేసే ఆ దేశ మూడో అతిపెద్ద చమురు సంస్థ, ఓ విమానాల తయారీ సంస్థ కూడా ఉన్నాయి.
ఆయా కంపెనీలను చైనా ఆర్మీ నిర్వహించడం లేదా నియంత్రించడం వంటివి చేస్తుందనే ఆరోపణలతో అమెరికా ఈ చర్యలకు దిగింది.
చైనా మిలిటరీతో సంబంధాలు కలిగిన పౌర సంస్థల జాబితాను గతేడాది జూన్‌లో అమెరికా రక్షణ శాఖ కాంగ్రెస్‌కు సమర్పించింది. 2020 డిసెంబర్‌లో ఆ జాబితాలో మరికొన్ని కంపెనీలను చేర్చింది. తాజా 9కంపెనీలతో కలిపి.. బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన చైనా కంపెనీల సంఖ్య 40కి చేరింది.
బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టకుండా గతేడాది నవంబర్‌లో ట్రంప్ సర్కార్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌నూ జారీ చేసింది. ఆయా కంపెనీల్లో ఉన్న పెట్టబడులను ఈ ఏడాది నవంబర్ 11 నాటికి కచ్చితంగా ఉపసంహరించుకోవాలని ఆర్డర్‌లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ట్రంప్‌పై 'శాశ్వత వేటు' సాధ్యమేనా?