ETV Bharat / international

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ షురూ - అఫ్గానిస్తాన్​

తాలిబన్​ శాంతి ఒప్పందానుసారం అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమయింది. ఒప్పందం ప్రకారం వందలాది మంది యూఎస్​ సైనికులు.. అఫ్గాన్​ను​ వీడి అమెరికాకు బయలుదేరారు.

US begins troop withdrawal from Afghanistan, official says
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ షురూ
author img

By

Published : Mar 10, 2020, 5:24 AM IST

Updated : Mar 10, 2020, 6:32 AM IST

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ షురూ

అఫ్గానిస్థాన్​లో గస్తీ కాస్తున్న అగ్రరాజ్యం అమెరికా దళాలు.. స్వదేశానికి పయనమయ్యాయి. తాలిబన్లతో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి లోబడి అఫ్గాన్​ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను షురూ చేశారు అమెరికా అధికారులు. ఇందులో భాగంగా ప్రస్తుతం అఫ్గాన్​లో ఉన్న దాదాపు 13వేల మంది యూఎస్​ సైనికులను 8600కు తగ్గించాలని అగ్రరాజ్యం భావిస్తోంది.

మరోవైపు రాజకీయ గందరగోళం మధ్యే సోమవారం ఇరుపార్టీల ప్రత్యర్థి నేతలు.. అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లాలు అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. అధ్యక్ష భవనానికి సమీపంలో ఇస్లామిక్ ఉగ్ర సంస్థ 10 రాకెట్లతో రెండు సార్లు దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్​ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలన్న అంశంలో ఎలా ముందుకెళ్లాలనే సందిగ్ధంలో ఉన్నారు అమెరికా అధికారులు.

Last Updated : Mar 10, 2020, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.