ETV Bharat / international

ఇరాకీ మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు - అమెరికా ప్రతీకార దాడులు

నిన్న సంకీర్ణ దళాలపై ఇరాకీ దళాలు దాడులు చేసి.. ముగ్గురు సైనికులను హతమార్చిన నేపథ్యంలో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. అన్బర్ ప్రావిన్స్​లోని ఇరాకీ మిలీషియా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.

US attacks Iraqi militia base in Anbar after 3 coalition troops killed in rocket attack
ఇరాకీ మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార దాడులు
author img

By

Published : Mar 12, 2020, 6:10 AM IST

అన్బర్ ప్రావిన్స్​లోని ఇరాకీ మిలీషియా స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. బుధవారం ఇరాకీ దళాలు జరిపిన రాకెట్​ దాడుల్లో ఇద్దరు అమెరికన్లు సహా ముగ్గురు సంకీర్ణ దళ సభ్యులు మరణించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతీకార దాడులకు దిగింది.

"ఇరాక్​లోని తాజీ సైనిక స్థావరంపై 15కి పైగా చిన్న రాకెట్లతో దాడి చేశాం." - మైల్స్ కాగ్గిన్స్, సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి

బుధవారం ఇరాక్ చేసిన దాడుల్లో ఇద్దరు అమెరికన్లు, ఓ బ్రిటీష్ సైనికుడు మరణించినట్లు కాగ్గిన్స్​ పేర్కొన్నారు. అందుకే ఇరాక్​ కాలమానం ప్రకారం మార్చి 11న రాత్రి 7.30 గంటల సమయంలో ఇరాకీ దళాలపై ప్రతీకార దాడులు చేసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. శత్రు స్థావరాల్లో జరిగిన నష్టాన్ని ప్రస్తుతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రపంచ ప్రమాదకర వ్యాధిగా కరోనా: డబ్ల్యూహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.