ETV Bharat / international

'భారత్​కు క్షిపణుల విక్రయానికి అమెరికా రెడీ' - భారత్ అమెరికా ఆయుధ ఒప్పందాలు

భారత్​కు మరిన్ని ఆయుధాలు విక్రయించేందుకు సిద్ధమైంది అమెరికా. హర్పూన్ మిస్సైళ్లు సహా రెండు రకాల తెలికపాటి టార్పిడోలను భారత్​కు అమ్మనున్నట్లు అమెరికా కాంగ్రెస్​కు ఇచ్చిన నోటిఫికేషన్​లో ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.

US approves sale of missile to India
భారత్​కు ఆయుధాలు విక్రయించేందు అమెరికా రెడీ
author img

By

Published : Apr 14, 2020, 11:08 AM IST

భారత్​కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రంప్ పాలనా యంత్రాంగం అమెరికా కాంగ్రెస్​కు నోటిఫికేషన్ సమర్పించింది. దాదాపు 155 మిలియన్ డాలర్ల విలువైన హర్పూన్​ మిస్సైళ్లు​, తేలికపాటి టార్పిడోలను భారత్​కు విక్రయించనున్నట్లు అందులో పేర్కొంది.

భారత్​కు విక్రయించే ఆయుధాల వివరాలు..

  • సుమారు 92 మిలియన్​ డాలర్ల విలువైన ఏజీఎం-84ఎల్​ హర్పూన్​ క్షిపణులు 10.
  • ఎంకే 54 ఆల్​ ఆప్​ రౌండర్ తేలికపాటి టార్పిడోలు 16.
  • ఎంకే 54 ఎక్సర్​సైజ్​ టార్పిడోలు 3.
  • వీటి విలువ దాదాపు 63 మిలియన్​ డాలర్లు.

రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠం

హర్పూన్​ మిస్సైల్​ను​ పీ-81 ఎయిర్​క్రాఫ్ట్​కు అనుసంధానం చేయడం ద్వారా క్లిష్ణమైన సముద్ర మార్గాల్లో పహారా మరింత సులభం కానుంది. అమెరికా సహా ఇతర రక్షణ వ్యవస్థలతో పరస్పర సహకారం మరింత పెంచుకునే అవకాశముంది.

"ఈ ఆయుధాలు భారత్​ సొంతమైతే భారత్​ స్థానిక ప్రమాదాల రక్షణ సామర్థ్యం సహా దేశీయ రక్షణ వ్యవస్థ మరింత మెరుగవుతుంది."

-పెంటగాన్, అమెరికా రక్షణ విభాగం

ఇదీ చూడండి:అగ్రరాజ్యంలో లెక్కల్లోకి రాని మృతులు మూడువేలకు పైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.