అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం నూతన ఒరవడికి తెరతీసింది. మానవ మృతదేహాలను సేంద్రియ ఎరువుగా మార్చడాన్ని చట్టబద్ధం చేసింది. భూస్థాపన స్థలాలు, శ్మశానాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి మృతదేహాలను ఉద్యానవనాల్లో ఎరువుగా ఉపయోగించేందుకు అనుమతించనుంది .
"ప్రకృతికి తిరిగివ్వడం అనేది మానవ జీవన చక్రంలో భాగం. మరణం కూడా ఇందులో అందంగా కన్పిస్తుంది."
-కత్రినా స్పేడ్, మానవ ఎరువు పరిశోధకురాలు
మానవ మృతదేహంతో ఎరువు తయారీ అనే అంశంపై పదేళ్ల కిందట తనకు ఆసక్తి కలిగిందని కత్రినా చెప్పారు. సాంకేతికంగా అమలు సాధ్యమేనా అని పరిశీలించారు. ఈ ప్రక్రియలో భాగంగా మృతదేహాన్ని30 రోజుల పాటు ఓ పెట్టెలో ఉంచుతారు. అనంతరం ఎరువుగా వాడతారు.
వచ్చే సంవత్సరం మే నుంచి ఈ చట్టం అమలవుతుంది.
ఇదీ చూడండి: 'రాజకీయ లబ్ధి కోసమే రఫేల్పై ఆరోపణలు'