ETV Bharat / international

'ఆ రోజున అంటువ్యాధుల సంసిద్ధత దినం'

డిసెంబర్​ 27ను 'అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం'గా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కొవిడ్​-19 లాంటి సాంక్రమిక వ్యాధులు ఏటా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు అవసరమని అభిప్రాయపడింది.

United Nations makes Dec 27 Epidemic Preparedness day
'ఆ రోజున అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం'
author img

By

Published : Dec 8, 2020, 11:27 AM IST

ఏటా ప్రపంచవ్యాప్తంగా సాంక్రమిక వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం(యూఎన్​జీఏ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్​ 27ను ''అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం'గా నిర్వహించాలని తీర్మానించింది. కొవిడ్​-19 లాంటి మహమ్మారులను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. సాంక్రమిక వ్యాధులను ఎదుర్కొనేందుకు దృఢమైన వైద్యవిధానం అవసరమని అభిప్రాయపడింది.

" అంటువ్యాధులు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి. ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తాయి. జీవనోపాధిని దెబ్బతీస్తాయి. వీటివల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు అధికంగా నష్టపోతాయి."

--ఐక్యరాజ్యసమితి

ప్రపంచ ఆరోగ్య సంస్థకు సైతం పలు సూచనలు చేసింది ఐరాస. 'అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం'లో భాగంగా సాంక్రమిక వ్యాధులకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని నిర్దేశించింది. అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి : తీవ్ర పేదరికంలోకి 20 కోట్ల మంది: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.